కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) హీరోగా నటించిన ‘బింబిసార’ సినిమాలో ‘ఓ తేనె ప‌లుకుల’ పాట‌ రిలీజ్ ఎప్పుడంటే!

Updated on Jul 20, 2022 12:48 AM IST
సోషియో ఫాంటసీగా తెరకెక్కిన బింబిసార సినిమాలో కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) రెండు గెటప్స్..
సోషియో ఫాంటసీగా తెరకెక్కిన బింబిసార సినిమాలో కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram) రెండు గెటప్స్..

నంద‌మూరి హీరో క‌ల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘బింబిసార’. సోషల్ ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుడు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమాలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇటీవల బింబిసార సినిమా నుంచి రిలీజైన ‘ఈశ్వరుడే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ‘ఓ తేనె పలుకుల’ పాటను రిలీజ్ చేసే డేట్స్‌ను ప్రకటిస్తూ పోస్టర్‌‌ రిలీజ్ చేశారు.  

కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram)  బింబిసార సినిమా పోస్టర్

రెండు రోజుల తర్వాత వీడియో..

బింబిసార సినిమాలో ‘ఓ తేనె పలుకుల’ పాటను జూలై 21న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే ఆ పాట ఫుల్‌ వీడియోను కూడా విడుదల చేస్తామని తెలిపారు. అయితే వీడియో సాంగ్‌ను జూలై 23వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించారు. కల్యాణ్‌రామ్‌ బింబిసార క్యారెక్టర్‌‌లో నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వరీనా హుస్సేన్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 5వ తేదీన బింబిసార సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌‌పై భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్న బింబిసార సినిమాకు సీక్వెల్స్‌ను కూడా తెరకెక్కించనున్నట్టు ప్రకటించారు కల్యాణ్‌రామ్ (Kalyan Ram).

Read More : వారిద్దరి బంధం ‘ముద్దపప్పు ఆవకాయ’ .. ‘లాల్‌సింగ్ చద్దా’లో కరీనా ఫస్ట్‌ లుక్‌పై చిరంజీవి (Chiranjeevi) ట్వీట్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!