ఎన్టీఆర్‌‌ (Junior NTR) – కొరటాల సినిమాలో పవర్‌‌ఫుల్‌ క్యారెక్టర్‌‌ చేయనున్న విజయశాంతి! ఓకే చెప్పారా? లేదా?

Updated on Sep 06, 2022 04:19 PM IST
 ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రిలీజై చాలా రోజులే అవుతున్నా ఎన్టీఆర్‌ (Junior NTR) మరో సినిమా స్టార్ట్ చేయలేదు.
ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రిలీజై చాలా రోజులే అవుతున్నా ఎన్టీఆర్‌ (Junior NTR) మరో సినిమా స్టార్ట్ చేయలేదు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో పాన్‌ ఇండియా స్టార్‌‌ ఇమేజ్ సొంతం చేసుకున్నారు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ (Junior NTR). ఎన్టీఆర్‌‌ రేంజ్‌కు తగినట్టుగానే ఎన్టీఆర్‌30 సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు డైరెక్టర్‌‌ కొరటాల శివ. తారక్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్ర్తసుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. అయితే చాలా రోజులుగా షూటింగ్‌ స్టార్ట్‌ కాకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశలో ఉన్నారు. ఈ సినిమా కోసం స్టార్ యాక్టర్లను ఎంపిక చేస్తున్నారట కొరటాల. ఈ సినిమాలో విలన్‌గా విలక్షణ నటుడు జగపతిబాబును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

 ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా రిలీజై చాలా రోజులే అవుతున్నా ఎన్టీఆర్‌ (Junior NTR) మరో సినిమా స్టార్ట్ చేయలేదు.

ప్రస్తుతానికి క్లారిటీ లేదు..

ఈ సినిమాలో పవర్ఫుల్‌ మహిళ క్యారెక్టర్‌‌ కూడా ఉందని తెలుస్తోంది. ఆ క్యరెక్టర్‌‌ కోసం అలనాటి హీరోయిన్‌,  లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతిని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. ఆమెకు కొరటాల కథ కూడా వినిపించారని టాక్.  అయితే ఆమె ఈ క్యారెక్టర్‌‌లో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

చాలా కాలం తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నారు విజయశాంతి. తన క్యారెక్టర్‌‌ నచ్చడం వల్లే సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించానని, ఇకపై అటువంటి రోల్‌ వస్తుందనే నమ్మకం లేదని అప్పుడే చెప్పారు విజయశాంతి. మళ్లీ అలాంటి పాత్ర వస్తే చేస్తానని చెప్పిన ఆమె ఇకపై సినిమాలు చేయనని కూడా చెప్పిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమాకు మరి విజయశాంతి ఓకే చెప్తారా? లేదా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేది ఇప్పటివరకు ఫైనల్‌ కాలేదు. ఇప్పటికే ఈ చిత్రంలో ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ కోసం బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌, స్టార్‌ హీరోయిన్‌ సమంతల పేర్లు వినిపించాయి. అయితే వీరిద్దరూ ఎన్టీఆర్‌‌ (Junior NTR) పక్కన ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టమైంది.

Read More : ఎన్టీఆర్‌‌ (Junior NTR), ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్ మొదలయ్యేది ఎప్పటి నుంచంటే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!