ఎన్టీఆర్‌ (Junior NTR)‌ హీరోగా నటించిన ‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమాలోని కొమురం భీముడో సాంగ్‌పై రాజమౌళి కామెంట్స్!

Updated on Aug 17, 2022 09:22 PM IST
‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమాలోని కొమురం భీముడో సాంగ్‌లో ఎన్టీఆర్‌ (Junior NTR)‌  ఎక్స్‌ప్రెషన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు
‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమాలోని కొమురం భీముడో సాంగ్‌లో ఎన్టీఆర్‌ (Junior NTR)‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు

జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), రాంచరణ్‌ హీరోలుగా నటించిన ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సినిమా ఏ రేంజ్‌ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే ఆ సినిమా విజయంలో కొమురం భీముడో సాంగ్‌ అంతే కారణమని అందరికీ తెలిసిందే. ఆ పాటలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హావభావాలు, రాంచరణ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు.

ఈ సాంగ్‌లో నటనకుగాను తారక్‌ ఆస్కార్‌‌కు నామినేట్ అయ్యే  చాన్స్‌లు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దర్శకుడుగా రాజమౌళి స్థాయిని మరింత పెంచిన సినిమాలలో ఆర్ఆర్ఆర్ మూవీ కూడా ఒకటి. ఫుల్ రన్‌లో ఈ సినిమా ఊహించని స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. రాజమౌళి తాజాగా కొమురం భీముడో సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతమైన సీన్లు ఉన్నాయని, కొమురం భీముడో సాంగ్ సినిమాకు హైలెట్‌గా నిలిచిందని రాజమౌళి అన్నారు. ఈ పాటలో తారక్, చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్‌లో ఉందని కామెంట్లు చేశారు జక్కన్న.

‘ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌’ సినిమాలోని కొమురం భీముడో సాంగ్‌లో ఎన్టీఆర్‌ (Junior NTR)‌  ఎక్స్‌ప్రెషన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు

ఆ సినిమా నుంచే స్ఫూర్తి..

కొమురం భీముడో పాటలో భీమ్ బ్రిటిష్ వాళ్ల ఎదుట భరతమాత ముద్దుబిడ్డగా మోకరిల్లని ధైర్యంతో ఉంటాడని, రామ్ లక్ష్యం కొరకు మిత్రుడిని కఠినంగా శిక్షిస్తూ ఆవేదనతో నలిగిపోతూ ఉంటాడని చెప్పుకొచ్చారు. బ్రేవ్ హార్ట్ సినిమా నుంచి ఈ సాంగ్‌ను స్ఫూర్తి పొందానని జక్కన్న తెలిపారు. మెల్ గిబ్సన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన బ్రేవ్ హార్ట్ మూవీ 1995వ సంవత్సరంలో విడుదలై బ్లాక్ బస్టర్‌‌గా నిలిచింది.

బ్రేవ్ హార్ట్ క్లైమాక్స్‌ను చూసి కొమురం భీముడో సాంగ్ షూట్ చేశానని సినిమాలో నేను ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడును రామ్, భీమ్ పాత్రలలో చూశానని రాజమౌళి తెలిపారు.

రాజమౌళి తన సినిమాలలో కొన్ని సన్నివేశాలు ఇతర సినిమాలలోని సన్నివేశాలకు స్పూర్తి అని డైరెక్ట్‌గానే చెబుతుంటారు. జక్కన్న తర్వాత ప్రాజెక్ట్‌లతో కూడా సక్సెస్‌ అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌‌ (Junior NTR), ప్రభాస్‌, రాంచరణ్‌ రాజమౌళి సినిమాలతో పాన్‌ ఇండియా స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Read More : బింబిసార సినిమాలో కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) నటనపై కామెంట్లతో ఎన్టీఆర్‌‌ (Junior NTR) తారక్ ట్వీట్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!