Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట 100% సక్సెస్ సాధిస్తుందన్న చిత్ర యూనిట్
SarkaruVaariPaata: హీరో మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట రిలీజ్‌కు కొన్ని గంటలే టైం ఉంది. చిత్ర యూనిట్ ప్రతీ నిమిషం ప్రమోషన్లతో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. ట్విట్టర్ వేదికగా సరికొత్త ఇంటర్యూలో సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ చేశారు. దర్శకుడు పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ సర్కారు వారి పాట సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పారు. సర్కారు వారి పాట సంగతులు ఇలా ఉన్నాయి...
నా డ్రీమ్ ప్రాజెక్ట్: పరుశురామ్
సర్కారు వారి పాట (SarkaruVaariPaata) సినిమాకు హీర్ మహేష్ బాబు అందం చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఫ్యాన్స్‌కు పోకిరి బాగా నచ్చింది. మహేష్ బాబుతో సూపర్ హిట్ సినిమా చేయాలని నా డ్రీమ్. మహేష్ బాబు రేంజ్‌కు తగిన కథ దొరికాకే అతనితో సినిమా చేయాలనుకున్నాను. మహేష్ బాబును కలిసి నా సినిమా కథను చెప్పాను. మహేష్ ఓకే అన్నారు.
చాలెంజ్‌గా తీసుకున్నా: పరుశురామ్
మహేషే బాబు సినిమా నా డైరెక్షన్‌లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలి. ఫ్యాన్స్ కూడా మహేష్ బాబును ఎలా చూపించాలో చాలా సలహాలు ఇచ్చారు. అందరికీ నచ్చే విధంగా నేను మహేష్ బాబు సినిమా చేశాను. సర్కారు వారి పాట సినిమా ఓ చాలెంజ్‌గా తీసుకున్నాను. మహేష్ క్యారెక్టర్ ఈ సినిమాలో సరదాగా సాగిపోతుంది. ప్రిన్స్ డైలాగ్స్, మ్యానరిజం చూస్తే మహేష్ బాబుకు ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ అని ఫ్యాన్స్ అనుకుంటారు. కోవిడ్ కారణంగా సినిమా లేట్ అయింది... కానీ వెయిట్ చేసి మరీ హార్డ్ వర్క్ చేశాం. ఒకే క్యారెక్టర్‌లో హీరోలు సంవత్సరాలు తరబడి యాక్ట్ చేయడం కష్టమే. కానీ మహేష్ చేశారు. డైలాగులు పేలిపోతాయని అనుకుంటున్నాను. ఫ్యాన్స్ కూడా మహేష్ కోసం చాలా చేశారు. హ్యాష్ ట్యాగ్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూ సర్కారు వారి పాట సినిమాపై ఆసక్తి తగ్గకుండా చేశారు.
మ్యూజిక్ అదుర్స్ : పరుశురామ్
సరా.. సరా, కళావతి, పెన్నీ, మా మా మహేశా పాటలు అనంత శ్రీరామ్ బాగా రాశారు. అంతకు ముందు అనంత శ్రీరామ్ మహేష్ బాబు పాటలు తక్కువ రాశారు. టైటిల్ థీమ్ సరా సరా అడగ్గానే సూపర్‌గా రాశారు. రెండేళ్లు కష్టపడి అనంత శ్రీరామ్ సర్కారు వారి పాట సినిమా పాటలు తనకు బిగ్ బ్రేక్ ఇచ్చేలా రాశారు. సర్కారు వారి పాట ర్యాప్ క్లైమాక్స్‌లో ఉంటుంది. థమన్ హార్డ్ వర్క్ సినిమాలో కనిపిస్తుంది.
అమ్మాయిలు డాన్సులు వేయడం ఖాయం: థమన్
ఈ సినిమాకు నేను చాలా హార్డ్ వర్క్ చేశాను.. మిగతాది భగవంతుడిపై వదిలేశాను. సర్కారు వారి పాట సినిమా కోసం చాలా మ్యూజిక్ పరికారాలు కొన్నాం. సౌండ్ అదిరిపోయేలా మ్యూజిక్ కంపోజ్ చేశాను. బాధ్యత అనుకుని పనిచేశాను. సినిమా అంటే నాకు పిచ్చి. అందుకే ఏ సినిమానైనా నేను ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఎన్నో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ సర్కారు వారి పాట సినిమా లేట్ అయింది.. కానీ సినిమా ప్రమోషన్లకు ప్రొడ్యూసర్లు, ఫ్యాన్స్ ఎంతో సహకారం అందించారు. అమ్మాయిలు సర్కారు వారి పాట మ్యూజిక్‌ను చాలా ఎంజాయ్ చేస్తారన్నారు.
పదాల కోసం నాలుగు పుస్తకాలు నింపేశాను: అనంత శ్రీరామ్
పరుశురామ్ కథ చెప్పగానే నేను 200 శాతం హార్డ్ వర్క్ చేయాలనుకున్నాను. సర్కారు వారి పాట కథా బలం ఎక్కువ. ఇలాంటి సినిమాకు కష్టపడాలనకున్నాను. ఎన్ని పాటలైనా రాయాలనిపించింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పాటలు రాశాను. 190 పేజీల పుస్తకాలు నాలుగు వరకు పాటలతో నింపేశాను. పెన్నీ పాట కూడా యువతకు నచ్చేలా రాశాను. పెన్నీ పాటలో ఫస్ట్ ట్రంప్ పేరు రాశాను.. కానీ సినిమా లేట్ కావడంతో బైడన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు. బాబాయ్ బైడన్ అని ట్రంప్ పేరు మార్చి రాశాను. 2020 నుంచి 2022 వరకు సర్కారు వారి పాట సాంగ్స్ కోసం మార్పులు చేర్పులు చేస్తూనే ఉన్నాను.
ఫైనల్ టాక్
సర్కారు వారి పాట(SarkaruVaariPaata) సినిమా హ్యాపీగా వెళ్లి చూడండని దర్శకుడు పరుశురామ్ అన్నారు. ఫ్యాన్స్ చాలా కేర్‌గా ఉండాలని ఎలాంటి ప్రాబమ్స్ లేకుండా సినిమా చూడాలన్నారు. మహేష్ బాబుకు కూడా అభిమానుల పట్ల చాలా కేర్‌గా ఉంటారని.. ఏదైనా జరిగితే చాలా బాధపడతారన్నారు. మహేష్ బాబుకు బిగ్ హిట్ ఇవ్వాలని ... చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారని థమన్ అన్నారు. ఈ సినిమా బిగ్ హిట్ ఇవ్వాలని దేవున్ఇన కోరుకుంటున్నారు. పాటలు స్టాటర్స్, సినిమా ఫుల్ మీల్స్ సినిమాలా ఉంటుందని అనంత శ్రీరామ్ అన్నారు. తన భవిషత్తును మారస్తుందని శ్రీరామ్ మాట్లాడారు.