Ileana D'cruz Birthday Special - "మాయదారి చిన్నోడా" అంటూ కుర్రాళ్లను మాయ చేసిన గోవా బ్యూటీ !

Updated on Nov 01, 2022 08:00 PM IST
 'పోకిరి' సినిమాతో ఇలియానా (Ileana) స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  'కిక్' సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చింది ఇలియానా. 
'పోకిరి' సినిమాతో ఇలియానా (Ileana) స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  'కిక్' సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చింది ఇలియానా. 

అందంతో పాటు అభినయంతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఇలియానా డిక్రుజ్(Ileana). ఈమె మొదటి సినిమాతోనే ఫిలిమ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. 'దేవదాసు' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఇలియానా చాలా కాలం సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచారు. ఇలియానా తన నటనతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ పాపులర్ అయ్యారు. 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. వెండితెరపై తనదైన శైలిలో దూసుకుపోయిన ఈ గోవా బ్యూటీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.

ఇలియానా డిక్రుజ్(Ileana)

మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు అడుగులు
ఇలియానా డిక్రుజ్ 1987 నవంబర్ 1 తేదీన ముంబైలో జన్మించారు. తండ్రి కేథలిక్ కాగా, తల్లి ముస్లిం. ఇలియానా కుటుంబం ఆమె పదేళ్ల వయసులోనే ముంబై నుంచి గోవాకు వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. 2003 నుంచి ఇలియానా మోడలింగ్ కెరీర్ ప్రారంభించారు. 

పలు ర్యాంప్ వాక్‌లపై కూడా ఇలియానా తళుక్కుమన్నారు. నట శిక్షకులు ఎన్.జే. భిక్షు, అరుణ భిక్షు దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. ఆ తరువాత సినిమా అవకాశాల కోసం పలు ప్రయత్నాలు చేశారు.

ఇలియానా డిక్రుజ్(Ileana)

మొదటి సినిమాతోనే అవార్డు
టాలీవుడ్ (Tollywood) దర్శకుడు తేజ నిర్వహించిన ఓ సినిమా ఆడిషన్స్‌కు ఇలియానా (Ileana) వెళ్లారు. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమా తెరకెక్కలేదు. 2006లో వైవీఎస్ చౌదరీ తెరకెక్కించిన 'దేవదాసు' సినిమాతో ఇలియానా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే ఇలియానా తెలుగుతో పాటు సౌత్ ప్రేక్షకులను మెప్పించారు. 'దేవదాసు' సినిమాకు గానూ ఇలియానా ఉత్తమ నటిగా ఫిలిమ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకున్నారు.

ఇలియానా డిక్రుజ్(Ileana)

'పోకిరి'తో పెరిగిన ఇలియానా క్రేజ్
'దేవదాసు' సినిమా రిలీజ్ అయిన సంవత్సరమే ఇలియానా నటించిన 'పోకిరి' సినిమా విడులైంది. మహేష్ బాబుతో ఇలియానా నటన థియేటర్లను షేక్ చేసింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన 'పోకిరి' 2006లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఇలియానా స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 

తెలుగుతో పాటు తమిళ సినిమా రంగంలోనూ ఇలియానా మంచి అవకాశాలను అందుకున్నారు. 2006లో 'కేడీ' చిత్రంతో తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాకపోయినా.. ఇలియానా సౌత్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరుగా మారారు. 

రవితేజ నటించిన ఖతర్నాక్, జూనియర్ ఎన్టీఆర్‌తో రాఖీ, ప్రభాస్‌తో మున్నా .. ఇలా పెద్ద హీరోలతో ఇలియానా వరుస సినిమాలు చేశారు.  

ఇలియానా డిక్రుజ్(Ileana)



 
ఉత్తమ నటిగా ఇలియానా(Ileana)
2007లో హీరో సిద్ధార్థ్ నటించిన 'ఆట'లో ఇలియానా హీరోయిన్‌గా నటించారు. ఇక 2008లో పవన్ కల్యాణ్ నటించిన 'జల్సా'తో ఇలియానా మరింత పాపులర్ అయ్యారు. సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఇలియానా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆట, జల్సా సినిమాలలో ఇలియానా నటనకు ఉత్తమ నటి కేటగిరీలో ఫిలిమ్ ఫేర్ అవార్డులు దక్కాయి.

తరుణ్‌తో నటించిన 'భలే దొంగలు' ఇలియానాకు విజయం అందించలేకపోయింది. 2009లో రవితేజతో మరోసారి గోవా సుందరి జత కట్టింది. 'కిక్' సినిమాతో సౌత్ ప్రేక్షకులకు కిక్ ఇచ్చింది ఇలియానా. 

'కిక్' సినిమా తరువాత నితిన్ సరసన 'రెచ్చిపో', మంచు విష్ణు సరసన 'సలీమ్' చిత్రాల్లో ఇలియానా నటించారు. అయితే ఈ చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆమె గ్రాఫ్ కూడా డౌన్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన శక్తి, నేను నా రాక్షసి సినిమాలు కూడా అంతగా సక్సెస్ కాలేదు. 

ఇలియానా డిక్రుజ్(Ileana)

2012లో తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రిలీజ్ అయిన 'నంబన్' సినిమాలో విజయ్ సరసన ఇలియానా నటించారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. హిందీ సినిమా 'త్రీ ఇడియట్స్'కు రీమేక్‌గా ఈ సినిమాను శంకర్ తెరకెక్కించారు. అల్లు అర్జున్‌తో 'జులాయి' కూడా ఇలియానాకి హిట్ ఇచ్చింది. ఆ తర్వాత రవితేజ సరసన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో ఇలియానా నటించారు. కానీ ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. 

'బర్ఫీ' చిత్రంతో ఇలియానా బాలీవుడ్‌ (Bollywood) లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాను దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రాతో కలిసి ఇలియానా నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు ఇలియానా. ప్రస్తుతం ఇలియానా రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. 

Read More: Keerthy Suresh Birthday Special:  "మహానటి"గానే కాదు "కళావతి"గా కూడా కీర్తి సురేష్ నటన అద్భుతమే!

ఇలియానా డిక్రుజ్(Ileana)

 
 
ఇలియానా మరిన్ని సినిమాలతో ప్రేక్షకులకు వినోదం పంచాలని కోరుకుంటూ.. హ్యాపీ బర్త్ డే ఇలియానా.
పింక్ విల్లా
 
Advertisement
Credits: Wikipedia

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!