గాడ్‌ ఫాదర్‌ ఉండుంటే కష్టాలుండేవి కాదు: వైరలవుతున్న హీరో నిఖిల్‌(Nikhil) కామెంట్స్

Updated on Aug 27, 2022 04:04 PM IST
హీరో నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil) నటించిన కార్తికేయ2 సినిమా రికార్టు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళుతోంది
హీరో నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil) నటించిన కార్తికేయ2 సినిమా రికార్టు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళుతోంది

హ్యాపీడేస్‌ సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil). తర్వాత పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యారు. అదే సమయంలో సినిమా హిట్‌ కావడంతో స్టార్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల కార్తికేయ2 సినిమాతో మన ముందుకు వచ్చిన నిఖిల్.. సూపర్ డూపర్ హిట్‌ను అందుకున్నారు. కార్తికేయ2 సినిమా హిట్‌ అయిన సందర్భంగా నిఖిల్ మీడియాతో మాట్లాడారు

‘సినీ పరిశ్రమలో నాకంటూ ఓ గాడ్‌ ఫాదర్‌ ఉండుంటే ఇబ్బందులు పడేవాడిని కాదు’ అని అంటున్నారు నటుడు నిఖిల్‌. తమ చిత్రానికి ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒక సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాలంటే కథే ముఖ్యం అని.. అది బాగుంటే తప్పకుండా విజయం దక్కుతుందని అన్నారు నిఖిల్.

హీరో నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil) నటించిన కార్తికేయ2 సినిమా రికార్టు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళుతోంది

ఆరేళ్ల తర్వాత..

‘సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేని ఒక కుటుంబం నుంచి వచ్చి నటుడిగా మారడమే నాకో పెద్ద విషయం. ఈరోజు ప్రేక్షకుల నుంచి పొందుతున్న అభిమానాన్ని చూస్తుంటే నా మొదటి సినిమా ‘హ్యాపీ డేస్‌’ రోజులు గుర్తుకు వస్తున్నాయి. పరిశ్రమ అంటేనే రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ లాంటిది. ప్రతి ఒక్కరూ ఇందులోకి రావాలని ఆశ పడుతుంటారు. ఏదో రకంగా ఎత్తుపల్లాలు చూస్తుంటారు.

‘హ్యాపీ డేస్‌’ తర్వాత  వెంటనే 6 సినిమాలు చేశా. సినిమా, కథల విషయంలో దిశా నిర్దేశం చేయడానికి పరిశ్రమలో నాకు మార్గదర్శకులెవరూ లేరు. వరుస పరాజయాల అనంతరం  ఆరు సంవత్సరాల తర్వాత ‘స్వామి రారా’తో మంచి విజయాన్ని అందుకున్నాను. అన్నింటికంటే కథే ముఖ్యమని అప్పుడు అర్థమైంది. ఇండస్ట్రీలో నాకూ ఒక గాడ్‌ ఫాదర్‌ ఉండి ఉంటే.. కెరీర్‌ స్టార్ట్ చేసిన సమయంలో అన్ని కష్టాలు ఉండేవి కాదు. ఏది ఏమైనా జీవితంలో ఎత్తుపల్లాలు సహజమే’ అని చెప్పుకొచ్చారు నిఖిల్‌ (Nikhil).

Read More : నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమాపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) కామెంట్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!