తగ్గేదేలే అనేట్టుగా కలెక్షన్లలో దూసుకుపోతున్న నిఖిల్‌ (Nikhil) కార్తికేయ2 .. 9వ రోజు ఎంత కొల్లగొట్టిందంటే?

Updated on Aug 22, 2022 08:00 PM IST
నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా హిందీలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది
నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా హిందీలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది

యంగ్‌ హీరో నిఖిల్ (Nikhil), అనుపమా పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ 'కార్తికేయ 2'. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.

ద్వారకా నగరం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన కార్తికేయ2 సినిమా.. 'కార్తికేయ' చిత్రంలో లానే ఎన్నో ట్విస్ట్ లతో తెరకెక్కింది. మొదటి రోజు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో వీకెండ్ కే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది. రెండో వీకెండ్ కూడా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా కలెక్షన్లు రాబడుతోంది. ముఖ్యంగా హిందీలో కార్తికేయ2 మూవీ కలెక్షన్లు బాగున్నాయి.

నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా హిందీలోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది

కార్తికేయ2 సినిమా తొమ్మిది రోజుల కలెక్షన్స్ గమనిస్తే:

 

నైజాం 8.58 Cr

సీడెడ్ 3.52 Cr

ఉత్తరాంధ్ర 3.16 Cr

ఈస్ట్ 1.87 Cr

వెస్ట్ 1.24 Cr

గుంటూరు 1.95 Cr

కృష్ణా 1.61 Cr

నెల్లూరు 0.68 Cr

ఏపీ + తెలంగాణ (టోటల్) 22.61 Cr

రెస్ట్ ఆఫ్ ఇండియా 1.92 Cr

ఓవర్సీస్ 4.30 Cr

హిందీ మరియు ఇతర వెర్షన్లు 7.11 Cr

వరల్డ్ వైడ్ (టోటల్) 35.94 Cr

కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్‌‌ రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన కార్తికేయ2 సినిమా 9 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ.35.94 కోట్ల షేర్ రాబట్టి బ్లాక్ బస్టర్‌‌గా నిలిచింది. రెండో ఆదివారం కూడా నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా రూ.2.4 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది

 Read More : మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న నిఖిల్ (Nikhil) కార్తికేయ 2..హిందీలో థియేటర్లు పెంచారని టాక్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!