కార్తికేయ 2 సినిమాను హిందీలో రిలీజ్ చేసేందుకు భయపడ్డాను. కానీ ఇప్పుడు ఆనందిస్తున్నా: హీరో నిఖిల్(Nikhil)

Updated on Aug 27, 2022 07:11 PM IST
యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా వంద కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది
యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా వంద కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది

హీరో నిఖిల్​ సిద్ధార్థ్​(Nikhil)​ నటించిన తాజా చిత్రం కార్తికేయ 2. అనేక వాయిదాల తర్వాత విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగులోనే కాదు హిందీలోనూ బాలీవుడ్​ సినిమాలకు పోటీగా మంచి కలెక్షన్లు రాబడుతోంది.

అయితే కార్తికేయ2 సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి రెడీ అయినప్పుడు నిఖిల్ భయపడ్డాడట. ఈ సినిమా సక్సెస్​ను ఎంజాయ్​ చేస్తున్న నిఖిల్​, సినిమా నిర్మాణం, విడుదల సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను అభిమానులతో పంచుకున్నాడు.

కార్తికేయ2 సినిమా విడుదలకు ముందు తన ఫీలింగ్స్ ను బయటపెట్టాడు హీరో నిఖిల్. ఈ సినిమాను హిందీలో డబ్ చేస్తామని నిర్మాతలు చెప్పినప్పుడు ముందు భయపడ్డానని, కానీ ఫలితం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉందని అంటున్నాడు.

యంగ్‌ హీరో నిఖిల్ సిద్దార్థ్‌ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా వంద కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది

వంద కోట్ల క్లబ్​లోకి..

ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిన సందర్భంగా కర్నూలులో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా విశేషాలను పంచుకున్నాడు నిఖిల్. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలతో హిందీలో కూడా తెలుగు సినిమాకు లైన్ క్లియర్ అయిందని, అదే ధైర్యంతో కార్తికేయ2ను హిందీలో విడుదల చేశామని తెలిపిన నిఖిల్.. తమ నమ్మకం నిజమైందని చెప్పుకొచ్చాడు.

50 స్క్రీన్స్ తో ప్రారంభమై, ప్రస్తుతం ఉత్తరాదిన 1200 స్క్రీన్స్ లో కార్తికేయ2 హిందీ వెర్షన్ ను ప్రదర్శిస్తున్నారని తెలిపాడు నిఖిల్. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అఖండ విజయం సాధించింది. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న సినిమా కార్తికేయ2 మాత్రమే. తాజాగా వచ్చిన లైగర్ సినిమా ప్రభావం, కార్తికేయ-2పై ఉండదని తేలిపోయింది. దీంతో ఈ వీకెండ్ కూడా కార్తికేయ2 కు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. అటు నార్త్ లో కూడా పరిస్థితి ఇలానే ఉంది. నిఖిల్​(Nikhil)​ హీరోగా నటించిన సినిమాల్లో  వంద కోట్ల క్లబ్​లో చేరిన తొలి సినిమా కార్తికేయ 2.

Read More : గాడ్‌ ఫాదర్‌ ఉండుంటే కష్టాలుండేవి కాదు: వైరలవుతున్న హీరో నిఖిల్‌(Nikhil) కామెంట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!