నాన్న సపోర్ట్ వద్దు.. మీ సపోర్ట్ కావాలి.. ‘చోర్‌‌ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆకాష్ పూరి (Akash Puri)

Updated on Jun 23, 2022 08:14 PM IST
ఆకాష్‌ పూరి
ఆకాష్‌ పూరి

తన తండ్రి, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సపోర్ట్‌ ఇకపై తనకి వద్దని అంటున్నాడు యువ హీరో ఆకాష్‌ పూరీ (Akash Puri). ఆకాష్‌ హీరోగా నటించిన సినిమా ‘చోర్‌ బజార్‌’. జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో యాక్షన్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. జూన్‌ 24న చోర్‌‌ బజార్‌‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘చోర్‌ బజార్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో ఆకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కష్టపడి చేశా..

‘చోర్‌ బజార్‌’ సినిమాను చాలా కష్టపడి చేశాం. మా ఊర్లో ఉన్నప్పుడు దర్శకుడు జీవన్‌ ఒకసారి నన్ను కలిశారు. నాతో ఒక కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చేయాలనుకుంటున్నానని చెప్పారు. కథ వినగానే బాగా నచ్చి ఓకే చెప్పేశాను. ఇలాంటి కథను నాకు చెప్పిన జీవన్‌కు, సినిమా యూనిట్‌కు థ్యాంక్స్. చోర్‌‌ బజార్ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది.

చోర్‌‌ బజార్ సినిమా పోస్టర్

కామెంట్స్ చదవడం అలవాటు

నేను నటించిన సినిమాకు సంబంధించి ఏ సినిమా ట్రైలర్‌, టీజర్‌ విడుదలైనా నెటిజన్లు పెట్టే కామెంట్స్‌ చదవడం అలవాటు. ప్రేక్షకులు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్‌ నాకు బాగా ఎక్కువ. ఆ కామెంట్లు చదవద్దని ఎవరు ఎన్నిసార్లు చెప్పినా దానిని మానుకోలేను. ఆ కామెంట్స్‌ చూసిన తర్వాతే ఎక్కువమంది నన్ను నెపో కిడ్‌గా చూస్తున్నారని తెలిసింది. ఒక స్టార్‌ కొడుకు ఇండస్ట్రీలోకి వస్తే ఎవరూ అతన్ని సీరియస్‌గా తీసుకోరు. ఏ స్టార్‌ కిడ్‌ అయినా నెపోటిజం పేరుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగలడు కానీ టాలెంట్‌ ఉంటేనే సక్సెస్‌ సాధించగలడు.

మీ అందరూ అంటున్నట్టు నాకు అన్నీ ఉన్నాయి. మా నాన్న చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో పెద్ద కోట, తిరగడానికి కోట్ల రూపాయల కార్లు. అయితే అవన్నీ మా నాన్నవి. నావి కాదు. మా నాన్న నాకిచ్చిన క్రెడిట్‌ కార్డు పక్కన పెట్టేస్తే నేను జీరో. ఈ క్లారిటీ నాకు 18 ఏళ్ల వయసులో వచ్చింది. సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత అందరూ నన్ను స్టార్‌ డైరెక్టర్‌ కొడుకుగానే చూశారు.

ఇప్పటివరకు చేసింది చాలు..

బంధుప్రీతిని సాకుగా చూపించి మా నాన్నతో సినిమా చేయవచ్చు. ‘నాన్నా.. లైగర్‌ సినిమా నాతో చెయ్‌’ అని అడిగితే ఆయన ఓకే అంటారు. కానీ నాకు అది వద్దు. బాగా కష్టపడి, నాన్న స్థాయికి ఎదగాలి. అప్పుడు మేమిద్దరం కలిసి సినిమా చేయాలి. ఇప్పటివరకూ నాన్న నాకు చేసింది చాలు. ఇకపై, మా నాన్నని ఏమీ అడగకూడదు. నాకు కావాల్సింది ఆయన సపోర్ట్‌ కాదు. మీ సపోర్ట్‌. దయచేసి ప్రోత్సహించండి’ అని చోర్ బజార్‌‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆకాష్‌ (Akash Puri) చెప్పాడు.

Read More : నాకో హిట్ సినిమా కావాలంటున్న ఆకాష్ పూరీ (AkashPuri).. అందుకు ప్రయత్నమే ‘చోర్‌‌బజార్’ సినిమా !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!