‘ఒక పథకం ప్రకారం’ అంటున్న పూరీ జగన్నాథ్‌ తమ్ముడు సాయిరామ్ శంకర్ (Sairam Shankar).. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

Updated on Jun 04, 2022 05:33 PM IST
‘ఒక పథకం ప్రకారం’ సినిమాలో సాయిరాం శంకర్ (Sairam Shankar)
‘ఒక పథకం ప్రకారం’ సినిమాలో సాయిరాం శంకర్ (Sairam Shankar)

సాయిరామ్ శంకర్ (Sairam Shankar), అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఒక పథకం ప్రకారం. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది. ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. 

తాజాగా ఈ చిత్ర పోస్టర్‌‌ను రాం గోపాల్ వర్మ విడుదల చేశాడు. పోస్టర్‌‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమా కాన్సెప్ట్‌ను మొత్తం పోస్టర్‌లోనే చూపించారు మేకర్స్. అన్ని సినిమాల్లో కంటే కూడా కొత్తగా కనిపిస్తున్నాడు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్లు పని చేస్తున్నారు.

దర్శకుడు వినోద్ విజయన్, ఎడిటిర్, మేకప్ ఆర్టిస్ట్, ప్రొడక్షన్ డిజైనర్ సహా మరో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు ‘ఒక పథకం ప్రకారం’ సినిమా కోసం పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరికొన్ని విశేషాలను త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

ఇక, పూరీ జగన్నాథ్‌ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయిరామ్ శంకర్ (Sairam Shankar).. కొన్ని సినిమాలు చేసినా బంపర్ ఆఫర్ మినహా ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టలేదు. తాజాగా, పూరీ జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ను హీరోగా పరిచయం చేసినా ఇండస్ట్రీలో చెప్పుకోదగిన హిట్‌ రాలేదనే చెప్పాలి. ఇండస్ట్రీలో ఏ హీరోతో సినిమా చేసినా బంపర్ హిట్ ఇచ్చే పూరీ జగన్నాథ్‌ తన తమ్ముడు, కొడుకుకు మాత్రం సరైన హిట్ ఇవ్వలేదు.

Read More: రాంగోపాల్ వర్మ (RGV) సినిమాలు రిలీజ్ కాకుండా చూస్తా.. ఫోర్జరీ కేసు పెట్టడంపై నిర్మాత నట్టికుమార్‌‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!