క్రిష్‌4లో హృతిక్ రోషన్‌ (Hrithik Roshan) పాట పాడే చాన్స్‌.. స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోందన్న దర్శకుడు

Updated on Aug 16, 2022 04:09 PM IST
హ్రితిక్ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా తెరకెక్కుతున్న క్రిష్‌ సినిమా సిరీస్‌లో నాలుగో భాగం కథ రెడీ అవుతోందని తెలిసింది.
హ్రితిక్ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా తెరకెక్కుతున్న క్రిష్‌ సినిమా సిరీస్‌లో నాలుగో భాగం కథ రెడీ అవుతోందని తెలిసింది.

హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా తెరకెక్కిన క్రేజీ సినిమా క్రిష్. ఈ సినిమాకు సీక్వెల్స్‌ కూడా వచ్చాయి. అయితే క్రిష్‌ సిరీస్‌లో 4వ పార్ట్‌ కూడా తెరకెక్కనుందని పోయినేడాది దర్శకుడు రాకేష్ రోషన్ వెల్లడించారు. అయితే అప్పటినుంచి ఆ సినిమా గురించిన ఏ విధమైన సమాచారం రాలేదు. ప్రస్తుతం క్రిష్‌4కు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి వచ్చింది.

క్రిష్‌3 కథ ఎక్కడి నుంచి అయితే ముగిసిందో అక్కడి నుంచే క్రిష్‌4 సినిమా స్టోరీ స్టార్ట్ అవుతుందని తెలిసింది. క్రిష్‌ మొదటి పార్ట్ రిలీజ్ అయ్యి 15 సంవత్సరాలు గడిచిన సందర్భంగా హృతిక్‌ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. #క్రిష్‌4, #HrithikRoshan అనే హ్యాష్‌ట్యాగ్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే హృతిక్‌ విక్రమ్ వేద అనే సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నారు.

హ్రితిక్ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా తెరకెక్కుతున్న క్రిష్‌ సినిమా సిరీస్‌లో నాలుగో భాగం కథ రెడీ అవుతోందని తెలిసింది.

కథ రెడీ అయ్యాకా మ్యూజిక్..

క్రిష్ ఫ్రాంచైజీకి సంబంధించిన నాలుగో సిరీస్‌లో కొత్త క్యారెక్టర్లు, మరిన్ని ట్విస్ట్‌లతో కొత్తగా ఉండబోతోంది. పూర్తిగా భిన్నంగా క్రిష్‌4 కథను రెడీ చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథ రెడీ అయిన వెంటనే నటీనటులు, టెక్నీషియన్ల ఎంపికను మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ఇప్పటివరకు చూడని యాక్షన్ సీక్వెన్స్‌లను క్రిష్‌4 సినిమాలో ప్రేక్షకులు చూడొచ్చని మేకర్స్ ద్వారా తెలుస్తోంది. 

పింక్‌విల్లాతో సంగీత దర్శకుడు రాజేష్‌ రోషన్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. క్రిష్4 సినిమాకు మ్యూజిక్ కంపోజిషన్ ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. అయితే స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత మ్యూజిక్‌ కంపోజ్‌ చేయడం స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతం రాకేష్‌ జీ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అందరి ఇళ్లలోనూ మ్యూజిక్ సిస్టంలు ఉంటున్నాయి. వాటికి సరిపోయేలా కొత్త టెక్నాలజీ మ్యూజిక్‌తో క్రిష్‌4కు సంగీతం అందించాలని అనుకుంటున్నాను. అలాగే క్రిష్‌4 సినిమాలో హృతిక్ (Hrithik Roshan) ఒక్క పాటైనా పాడుతారని చెప్పారు.

Read More : Hrithik Roshan: 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) కు మద్దతిచ్చినందుకు.. 'హృతిక్‌ రోషన్‌'కు బాయ్ కాట్ సెగ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!