పెళ్లి కాకుండా బిడ్డను కలిగి ఉన్నా తప్పు లేదు.. బిగ్ బీ సతీమణి జయా బచ్చన్ (Jaya Bachchan) షాకింగ్ కామెంట్స్

Updated on Oct 29, 2022 05:22 PM IST
పెళ్లి కాకుండా బిడ్డను కలిగి ఉంటే తప్పు లేదని బిగ్ బీ భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) షాకింగ్ కామెంట్స్ చేశారు. 
పెళ్లి కాకుండా బిడ్డను కలిగి ఉంటే తప్పు లేదని బిగ్ బీ భార్య జయా బచ్చన్ (Jaya Bachchan) షాకింగ్ కామెంట్స్ చేశారు. 

బాలీవుడ్ సీనియర్ నటి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ (Jaya Bachchan) షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘వాట్ ది హెల్ నవ్య’ అనే పాడ్‌కాస్ట్‌లో రీసెంట్‌గా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ షోలో ప్రస్తుత మానవ సంబంధాలపై మాట్లాడిన జయా బచ్చన్.. తన మనవరాలికి ఓ అదిరిపోయే సలహా ఇచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పటి సమాజ పోకడల ప్రకారం తన మనవరాలు నవ్యా నవేలీ నందా (Navya Naveli Nanda) పెళ్లి కాకుండా తల్లయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని జయా బచ్చన్ అన్నారు. 

ప్రస్తుతం వైద్యపరంగా చాలా మార్పులు వచ్చాయని జయా బచ్చన్ అన్నారు. ఎలాంటి ఎమోషన్స్ లేకుండానే చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారని ఆమె చెప్పారు. తన మనవరాలిని ఉద్దేశించి.. ‘నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్‌ను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నా. ఒకవేళ నీకు మంచి స్నేహితుడు ఉండి.. తనను ఇష్టపడి బిడ్డను కలిగి ఉండాలనుకుంటే.. ఈ సమాజంతో పనిలేదు. పెళ్లి అవ్వకుండానే బిడ్డ ఉంటే నాకు ఎలాంటి సమస్య లేదు’ అని నవ్యా నవేలీ నందాకు జయా బచ్చన్ సలహా ఇచ్చారు.

నా మాటలపై అభ్యంతరాలు రావొచ్చు

ప్రేమ, పెళ్లి లాంటి అంశాలపై జయా బచ్చన్ మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు వ్యక్తుల ప్రేమకు సంబంధించిన భౌతిక ఆకర్షణ తప్పనిసరి అని.. వారి మధ్య సమతుల్యం ఉండాలన్నారు. ‘నా మాటలపై సమాజం నుంచి అభ్యంతరాలు రావొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే వాస్తవం. మా కాలంలో ఇలాంటి ప్రయోగాలకు ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇదే జరుగుతోంది. యువత మధ్య బంధాలు చిరకాలం పటిష్టంగా ఉండాలి. అయితే ఈ రోజుల్లో శారీరక సంబంధాలు లేకపోతే.. ఆ బంధం ఎక్కువ రోజులు మనుగడ సాగించడం లేదు. రిలేషన్‌షిప్‌లో ఇద్దరి మధ్య సమన్వయం, కొత్త అనుభవాలు ఉండాల్సిన అవసరం ఉంది’ అని జయా బచ్చన్ పేర్కొన్నారు. 

యువతను చూస్తూ జాలేస్తోంది

ప్రస్తుత కాలంలో యువతను చూస్తుంటే తనకు జాలేస్తోందని జయా బచ్చన్ అన్నారు. ‘పెళ్లికి ముందే రిలేషన్‌షిప్.. అనుభవాలను వారు గిల్టీగా ఫీలవుతున్నారు. నా దృష్టిలో ఇది తప్పనిపిస్తోంది. ఒకవేళ శారీరక సంబంధాలు ఉండి, రిలేషన్‌షిప్ వర్కవుట్ కాదనే భావన వస్తే.. దానిని కూడా పాజిటివ్‌గా తీసుకోవాలి’ అని జయా బచ్చన్ చెప్పుకొచ్చారు.  

Read more: అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో సల్మాన్ (Salman Khan) సినిమా!.. కోలీవుడ్ దర్శకుడికి పచ్చజెండా ఊపిన కండలవీరుడు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!