Hrithik Roshan: 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) కు మద్దతిచ్చినందుకు.. 'హృతిక్‌ రోషన్‌'కు బాయ్ కాట్ సెగ

Updated on Aug 16, 2022 03:17 PM IST
బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) ఇటీవల ట్విట్టర్ వేదికగా అమీర్ ఖాన్ కు సపోర్ట్ చేశాడు.
బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) ఇటీవల ట్విట్టర్ వేదికగా అమీర్ ఖాన్ కు సపోర్ట్ చేశాడు.

బాలీవుడ్ లో ఈ మధ్య బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తోంది. మిస్టర్‌ ఫర్ఫెక‌్షనిస్ట్‌ అమీర్‌ ఖాన్‌ (Aamir Khan) సినిమాలను బహిష్కరించాలంటూ సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దేశంలో అశాంతి ఉందంటూ ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలకు గానూ నెటిజన్లు, పలు సంఘాలు ఆయనపై మండిపడ్డాయి. ఈ ప్రభావం అమీర్ ఖాన్ తాజా సినిమా ‘లాల్ సింగ్ చడ్డా’ పై పడింది.

ఈ సినిమా విడుదలకు ముందే.. #Boycott Laal Singh Chaddha హ్యాష్ ట్యాగ్‌తో నెగిటివ్ ప్రచారం చేశాయి కొన్ని వ్యతిరేక శక్తులు. హిందూ వ్యతిరేకతనే ప్రధానంగా చూపించడమే కాకుండా.. హిందూ దేవుళ్లని అవమానించారని అందుకే ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలని బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. టాలీవుడ్ నటి విజయశాంతి అయితే అమీర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ.. 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు.

ఒక్క సినిమాకు వందల కోట్ల మార్కెట్ ఉన్న అమీర్ కు.. హిట్, ఫ్లాప్‌లు పెద్ద లెక్క కాదు కానీ.. అన్ని సినిమాల రిజల్ట్ ఓ లెక్క.. 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) సినిమా రిజల్ట్ మరో లెక్క అనేట్టు చేశారు విమర్శకులు. అమీర్ సినిమా అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయన్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాకి మాత్రం ఒక్క రోజులో రూ.12 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే రావడం.. రెండోరోజు నుంచి 1300 షోలు రద్దు కావడం చూస్తే పక్కా ప్లాన్‌తో 'లాల్ సింగ్ చడ్డా'ని గట్టిదెబ్బే కొట్టారు.
 
ఆగస్టు 11వ తేదీన విడుదలైన 'లాల్ సింగ్ చడ్డా' (Laal Singh Chaddha) చిత్రాన్ని చూసేందుకు అభిమానులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో, తన చిత్రాన్ని చూడాలంటూ ప్రేక్షకులకు అమీర్ విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం అమీర్ కు మద్దతుగా నిలిచారు. 

ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ యాక్షన్ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) ఇటీవల ట్విట్టర్ వేదికగా అమీర్ ఖాన్ కు సపోర్ట్ చేశాడు. ‘ఇప్పుడే లాల్ సింగ్ చడ్డాను చూశా. ఈ సినిమా హృదయాన్ని నేను ఆస్వాదించా. ప్లస్‌లు, మైనస్‌లను పక్కన పెడితే, ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంది. దీన్ని అస్సలు మిస్ చేయకండి, ఇప్పుడే వెళ్లి చూడండి’ అంటూ ట్వీట్ చేశాడు. 

ప్రస్తుతం అదే హృతిక్‌ రోషన్‌ ను ఇబ్బందుల్లోకి నెట్టింది. 'లాల్ సింగ్ చడ్డా' సినిమా యొక్క చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు హృతిక్‌ను టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. వారు #BoycottVikramVedha (ఇది హృతిక్ యొక్క కొత్త చిత్రం) అనే హ్యాష్‌ట్యాగ్‌ను వైరల్ చేయడం ప్రారంభించారు. 

తాము వ్యతిరేకించే హీరోని ఎలా సపోర్ట్ చేస్తావంటూ.. కొంతమంది పని కట్టకుని హృతిక్ రోషన్‌ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. #BoycottVikramVedha అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. అయితే మంచి సినిమాను ప్రేక్షకుడికి దూరం ఎవరితరం కాదని.. సినిమాల కంటెంట్ ఉంటే.. ఇలాంటి హ్యాష్ ట్యాగ్‌లు ఎన్ని వచ్చినా అడ్డుకోలేవని హృతిక్ రోషన్‌ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.

Read More: Laal Singh Chaddha: 'లాల్ సింగ్ చద్దా' తెలుగు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో పానీపూరి తినిపించుకున్న చిరంజీవి, అమీర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!