రోజులో 15 గంటలు ఫ్రీజర్‌లో ఉండేదాన్ని.. ‘మిలీ’ కోసం పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా: జాన్వీ కపూర్ (Janhvi Kapoor)

Updated on Nov 01, 2022 12:03 PM IST
‘మిలీ’ (Mili) సినిమా షూటింగ్ సమయంలో తాను మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడ్డానని బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అన్నారు
‘మిలీ’ (Mili) సినిమా షూటింగ్ సమయంలో తాను మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడ్డానని బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అన్నారు

నటీనటుల జీవితాల్లో కొన్ని పాత్రలు అరుదుగా అభిస్తుంటాయి. సవాలు విసిరే అలాంటి క్యారెక్టర్లలో నటించినప్పుడే వారిలోని అసలైన ప్రతిభ బయటపడుతుంది. నటనలో ఒక మెట్టు పైకి ఎక్కించే అలాంటి పాత్రలు వచ్చినప్పుడు స్వీకరించి ముందుకెళ్లాల్సిందే. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు ‘మిలీ’ (Mili) చిత్రం రూపంలో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆమె.. షూటింగ్‌లో భాగంగా మైనస్ 16 డిగ్రీల గడ్డకట్టుకుపోయే చలిలో ఇరుక్కుపోయిన వ్యక్తిగా నటించారు. 

మలయాళ హిట్ సినిమా ‘హెలెన్’కు రీమేక్‌గా ‘మిలీ’ (Mili) తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఒరిజినల్‌కు దర్శకత్వం వహించిన మత్తుకుట్టి జేవియర్ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మిలీ’ మూవీకి సంబంధించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు జాన్వీ. ఈ చిత్రంలో తాను మిలీ నౌదియార్ అనే నర్సింగ్ విద్యార్థి రోల్‌లో నటిస్తున్నానని చెప్పారు. ‘మిలీలో నా పాత్ర కోసం శారీరకంగానే కాదు మానసికంగానూ ఇబ్బంది పడ్డా. దర్శకుడితో సూచనతో రోల్‌కు సెట్ అయ్యేలా 7.5 కిలోల బరువు పెరిగా. నేను పోషించిన పాత్ర (ఫ్రిడ్జ్‌లో ఉన్నట్లు)కు సంబంధించిన దృశ్యాలు కలలోకి వచ్చేవి’ అని జాన్వీ చెప్పారు.

‘మిలీ’ (Mili) సినిమా కోసం ఏడున్నర కిలోల బరువు తగ్గానని జాన్వీ (Janhvi Kapoor) చెప్పారు.

‘మిలీ చిత్రం షూట్ సమయంలో నాకు సరిగ్గా నిద్రపట్టేది కాదు. దీంతో నా ఆరోగ్యం దెబ్బతింది. మూడు రోజు పెయిన్ కిల్లర్స్ వాడా. నాతోపాటు దర్శకుడు జేవియర్ కూడా అస్వస్థతకు గురయ్యారు. రోజులో 15 గంటలు ఫ్రీజర్‌లో ఉండాల్సి వస్తే.. అక్కడ ఓ ఎలుక మీ వేళ్లను కొరుకుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కింది. ఇది చాలా మంచి చిత్రం. తప్పకుండా విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం నాకు ఉంది’ అని జాన్వీ కపూర్ పేర్కొన్నారు. 

సినీ పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగాలంటే నిరంతరం పని చేస్తూ ఉండాలని తన అమ్మ శ్రీదేవి చెబుతుండేవారని జాన్వీ కపూర్ అన్నారు. ‘మన పనిని మనం నిజాయితీగా, అవిశ్రాంతంగా చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఇది నా అనుభవంలో నేను నేర్చుకున్న విషయం. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాపై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. నేను కష్టపడి పని చేసే అమ్మాయిని. నన్ను నేను నిరూపించుకునేందుకు, నన్ను విమర్శించే వారికి నేనేంటో తెలియజేసేందుకు నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటా’ అని జాన్వీ కపూర్ వివరించారు. 

Read more: ఎన్టీఆర్ (Junior NTR) సరసన నటించేందుకు నేను రెడీ.. ఆయన అంటే చాలా ఇష్టం: జాన్వీ కపూర్ (Janhvi Kapoor)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!