కేజీఎఫ్‌3లో బాలీవుడ్ అందగాడు హ్రితిక్ రోషన్ (Hrithik Roshan).. క్లారిటీ ఇచ్చిన నిర్మాత విజయ్ కిరగందూర్

Updated on May 25, 2022 02:45 PM IST
కేజీఎఫ్‌3లో హ్రితిక్ రోషన్‌ ఎంపికపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత
కేజీఎఫ్‌3లో హ్రితిక్ రోషన్‌ ఎంపికపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

‘కేజీఎఫ్2’ సినిమాతో ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి తెలియజేశాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్.  కేజీఎఫ్‌ నుంచి మరో సీక్వెల్‌ తెరకెక్కించనున్నట్టు ప్రకటించాడు కూడా. అయితే కేజీఎఫ్‌3లో బాలీవుడ్‌ అందగాడు హ్రితిక్‌ రోషన్‌ (Hrithik Roshan) నటించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని కీలక పాత్రల్లో రవీనా టాండన్, సంజయ్ దత్‌ సహా పలువురు స్టార్లు నటిస్తున్నారు. తరువాతి సీక్వెల్‌లోని కీలక పాత్రలో హ్రితిక్ కనిపించనున్నాడని వస్తున్న వార్తలపై కేజీఎఫ్‌ నిర్మాత విజయ్ కిరగందూర్ క్లారిటీ ఇచ్చాడు. 

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘కేజీఎఫ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దానికి సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్‌2 రికార్డులను సైతం బ్రేక్ చేసింది. `ఆర్‌ఆర్‌ఆర్‌, `బాహుబలి` రికార్డులను తిరగరాస్తోంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలోనూ కలిపి సుమారు రూ.1,200 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ ఎండింగ్‌లో కేజీఎఫ్‌3 కూడా రాబోతున్నట్టు దర్శకుడు ప్రశాంత్ హింట్ ఇచ్చాడు. దీంతో అందరి ఫోకస్ ‘కేజీఎఫ్ 3’పై పడింది.

ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌ హీరోగా చేస్తున్న `సలార్‌`  చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ 30 –35% పూర్తయ్యింది. మరో షెడ్యూల్‌ కూడా ఇటీవలే మొదలైంది. హైదరాబాద్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. నవంబర్ నెలాఖరులోపు ‘సలార్‌‌’ సినిమా షూటింగ్ పూర్తి చేసి ‘కేజీఎఫ్ 3’పై ప్రశాంత్‌ ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో నిర్మాత విజయ్ కరగందూర్ కేజీఎఫ్ 3పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చాడు.

ఇప్పటికే కేజీఎఫ్2లో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు. కేజీఎఫ్ ఛాప్టర్ 3లో మరో బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్‌ను తీసుకోనున్నట్టు టాక్. ‘కేజీఎఫ్‌3లో కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దాని గురించి నిర్ణయం తీసుకోలేదు. చాప్టర్ 3 ఈ సంవత్సరం మొదలుకాదు. మాకు కొన్ని ప్లాన్‌లు ఉన్నాయి, అయితే ప్రశాంత్ ప్రస్తుతం సలార్‌తో బిజీగా ఉన్నాడు. యష్ కూడా తన కొత్త చిత్రాన్ని త్వరలో ప్రకటించనున్నాడు. కేజీఎఫ్3ని ప్రారంభించడానికి సరైన సమయం రావాలి. అందుకే ఈ కేజీఎఫ్‌3లో హ్రితిక్ నటిస్తాడా లేదా మరే ఇతర స్టార్స్ ఈ పార్ట్‌లో యాక్ట్‌ చేస్తారనేది ఇప్పుడే చెప్పలేం’ అని వివరించాడు. ఇక కేజీఎఫ్ 3లో హ్రితిక్ రోషన్ నటిస్తారనే వార్తలే భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం హ్రితిక్ (Hrithik Roshan) ‘విక్రమ్ వేద’, ‘ఫైటర్’ చిత్రాల్లో నటిస్తున్నాడు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!