Avatar 2 Trailer: విజువల్ వండర్‌గా ‘అవతార్ 2’ మూవీ ట్రైలర్.. కట్టిపడేస్తున్న పండోరా గ్రహంలోని విజువల్స్!

Updated on Nov 03, 2022 04:48 PM IST
‘అవతార్ 2’ (Avatar: The Way of Water) మూవీ ట్రైలర్ విజువల్ వండర్‌గా ఉందని నెటిజన్స్ అంటున్నారు 
‘అవతార్ 2’ (Avatar: The Way of Water) మూవీ ట్రైలర్ విజువల్ వండర్‌గా ఉందని నెటిజన్స్ అంటున్నారు 

బిగ్ స్క్రీన్‌పై విజువల్ వండర్స్‌ను చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే అలాంటి చిత్రాలు ఎప్పుడో ఒకసారి కానీ రావు. ఈ కోవలోకి చెందిన చిత్రమే ‘అవతార్’ (Avatar). ఈ సినిమాతో ఆడియెన్స్‌ను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron). అందుకే ఈ మూవీకి మరో నాలుగు సీక్వెల్స్‌ను ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో ‘అవతార్: ది వే ఆఫ్​ వాటర్’ను ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయనున్నారు. 

‘అవతార్ 2’ (Avatar 2)కు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా విశేషమైన స్పందన లభిస్తోంది. పండోరా గ్రహంపై ఇంతకుముందు చూడని సరికొత్త అందాల్ని, అద్భుతాల్ని ఈ ట్రైలర్‌లో చూపించారు. సముద్రంలో జరిగే కొన్ని సీన్స్ కట్టిపడేసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. 

‘అవతార్: ది వే ఆఫ్​ వాటర్’ (Avatar 2) మూవీ డిసెంబర్‌ 16న రిలీజ్ కానుంది

‘అవతార్ 2’ చిత్రంతోపాటు ‘అవతార్ 3’ షూటింగ్‌ను కూడా జేమ్స్ కామెరాన్ పూర్తి చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మాత్రం ‘అవతార్: ది వే ఆఫ్​ వాటర్’ (Avatar: The Way of Water) రిలీజ్ తర్వాతే మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. జోయీ సల్డానా, సామ్ వర్తింగ్టన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అవతార్ 2’ డిసెంబర్ 16న బిగ్ స్క్రీన్లలో రిలీజ్ కానుంది.  

ఇకపోతే, తెలుగు రాష్ట్రాల్లో ‘అవతార్ 2’కు విపరీతమైన హైప్ నెలకొంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారట. ‘అవతార్ 2’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు సుమారు రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు వినికిడి. పలువురు బడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలసి ఈ హాలీవుడ్ మూవీని కొనే ఆలోచనలో ఉన్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన వార్తలు కొన్ని రోజులుగా నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిల్లో ఎంత నిజముందో ఇంకా తెలియరాలేదు.  

Read more: వివాదంలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad).. ప్రైవేట్ సాంగ్ లో బూతు మంత్రం.. పోలీసులకు ఫిర్యాదు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!