Avatar2: అవతార్ 2 సినిమా టీజ‌ర్ మాములుగా లేదుగా..

Updated on May 11, 2022 09:57 AM IST
Avatar2:అవ‌తార్ హాలీవుడ్ సినిమా విజువ‌ల్స్‌తో వినోదం అందించింది. అవ‌తార్‌2 రూపంలో మ‌రోసారి విజువ‌ల్స్ హ‌వా చూప‌నున్నారు. అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. 
Avatar2:అవ‌తార్ హాలీవుడ్ సినిమా విజువ‌ల్స్‌తో వినోదం అందించింది. అవ‌తార్‌2 రూపంలో మ‌రోసారి విజువ‌ల్స్ హ‌వా చూప‌నున్నారు. అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. 

Avatar 2: అవ‌తార్ సినిమా ప్ర‌పంచంలో ఓ అద్భుత సృష్టి. ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లోనే అవ‌తార్ ఓ వండ‌ర్. అవ‌తార్ సినిమాకు సీక్వెల్‌గా ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ అవ‌తార్‌2 తెర‌కెక్కిస్తున్నారు. అవ‌తార్‌2 - ది వే ఆఫ్ వాట‌ర్ టీజ‌ర్ రిలీజ్ చేశారు. కొత్త ఎఫెక్టుల‌తో  విజువల్స్‌తో వీక్ష‌కుల‌కు వినోదం పంచునున్నారు..

Avatar2

Avatar2

అవతార్ 2 (Avatar 2) - ది వే ఆఫ్ వాటర్ టీజర్ రిలీజ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. విజువ‌ల్స్ ఎఫెక్ట్ చూసిన అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. జేమ్స్ కామెరూన్ అదిరిపోయే హాలీవుడ్ సినిమాలు తీయ‌డంలో టాలెంట్ ఉన్న ద‌ర్శ‌కుడు. అవ‌తార్ సినిమాకు మించి ఆక‌ర్షించేలా అవ‌తార్‌2 సినిమా తీస్తున్నారు. 

Avatar2

Avatar2

అవతార్ 2 (Avatar 2)  - ది వే ఆఫ్ వాటర్ సినిమాలో సీన్స్‌, ఫైట్స్ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. రెండు నిమిషాల లోపు టీజ‌ర్‌లో మైండ్ బ్లోయింగ్ స‌న్నివేశాలు ఉన్నాయి. ఇక సినిమాలో ఎలాంటి స‌న్నివేశాలు ఉన్నోయోన‌నే క్యూరియాసిటీ పెరిగింది. ఈ ట్రైలర్‌లో నీళ్ల‌లో తీసిన సీన్స్ ఆక‌ట్టుకున్నాయి. 

 

Avatar2

"మనం ఎక్కడున్నా ఈ కుటుంబం మనల్ని కాపాడుతుందనే నమ్మకం నాకుంది అంటూ ట్రైలర్ చివర్లో వినిపిస్తోంది"... ఈ మాట‌ల వెనుక ఏం జ‌రిగిందో తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. జేక్ కుటుంబం అవ‌తార్ గురించి చెప్పే క‌థ‌తో స్టోరి స్టాట్ అవుతుంద‌ని టాక్.

Avatar2

అవ‌తార్ ఎలాంటి పోరాటం చేసి వారి మ‌నుగ‌డ‌ను కాపాడుకున్నార‌నే క‌థ‌తో సినిమా సాగుతుంది. ఒకరినొకరు సురక్షితంగా ఉంచుకోవడానికి ఏం చేస్తారు. ఇవ‌న్నీ అవ‌తార్ 2 (Avatar 2)  చూడాలంటే డిసెంబర్ 16 వ‌ర‌కు ఆగాల్సిందే. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!