అవతార్‌‌ 2 (Avatar 2) ఎన్ని భాషల్లో అంటే?

Updated on Apr 27, 2022 08:36 PM IST
జేమ్స్‌ కామెరాన్‌ దర్శకత్వం వహిస్తున్న అవతార్‌‌ 2 (Avatar 2)
జేమ్స్‌ కామెరాన్‌ దర్శకత్వం వహిస్తున్న అవతార్‌‌ 2 (Avatar 2)

జేమ్స్‌ కామెరాన్‌ తన కెమెరాతో అద్భుతాలు సృష్టిస్తాడు. విజువల్ వండర్స్‌ సృష్టించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పటికే ఎన్నోసార్లు ఆ విషయం రుజువైంది. జేమ్స్‌ కామెరాన్‌ అద్భుత సృష్టికి నిలువెత్తు నిదర్శనం ‘అవతార్’. 2009లో రిలీజైన ఆ సినిమా ప్రపంచ సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. ఈ సినిమాలో వాడిన గ్రాఫిక్స్​కు ప్రపంచం దాసోహమైంది. ప్రపంచ సినిమా చరిత్రను తిరగరాసి ట్రెండ్ సెట్టర్‌‌గా నిలిచింది. అంతగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన సినిమాకు సీక్వెల్‌గా ‘అవతార్ 2’ తీస్తున్నాడు ఈ లెజెండరీ డైరెక్టర్‌‌.

2022 డిసెంబర్‌‌ 16న అవతార్‌‌ 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రస్తుతం హల్‌చల్‌ చేస్తోంది. అవతార్‌‌ 2 ఎన్ని భాషల్లో రిలీజ్‌ చేయనున్నారో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. ప్రపంచంలోని సుమారు 160 భాషల్లో సినిమాను విడుదల చేయబోతున్నట్టు వచ్చిన వార్త ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. 3డీ, 4డీ ఎక్స్‌, ఐమాక్స్, డాల్బీ విజన్, పీఎల్‌ఎఫ్‌తోపాటు ఇతర ఫార్మాట్లలో అవతార్‌‌ 2 సినిమాను రిలీజ్‌ కాబోతోంది.

ఇక, ఇంత క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్‌ కూడా భారీగానే ఉండనుంది. లాస్‌వెగాస్‌లోని కాసార్స్‌ ప్యాలెస్‌ సినామా కాన్‌లో అవతార్‌‌ 2 సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ ప్రీమియర్ ప్రసారం కాబోతోందని సమాచారం. సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్‌‌ 2 గ్లింప్స్‌ వీడియోను యూ ట్యూబ్‌లో చూడాలంటే మాత్రం కొంతకాలం వేచిచూడక తప్పదని మేకర్స్‌ అంటున్నారు. అవతార్‌‌ 2 ట్రైలర్‌‌ను మే నెల 6వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. అయితే దీనిపై ప్రస్తుతం అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. ప్రపంచంలోని సినీ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్న దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ క్రేజీ ప్రాజెక్ట్ అవతార్‌‌ 2 (Avatar 2) తెలుగులో కూడా సందడి చేయబోతోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!