Sulthana Video Song : య‌శ్ ధీరుడికి త‌ల‌వంచిన శిఖ‌రాలు - సుల్తానా వీడియో సాంగ్ రిలీజ్

Updated on May 24, 2022 10:25 AM IST
Sulthana Video Song: హీరో య‌శ్(Yash) న‌టించిన కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 సినిమాలోని ర‌ణ ర‌ణ ర‌ణధీరా వీడియో సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
Sulthana Video Song: హీరో య‌శ్(Yash) న‌టించిన కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 సినిమాలోని ర‌ణ ర‌ణ ర‌ణధీరా వీడియో సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

Sulthana Video Song: య‌శ్ న‌టించిన కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా ఇండియ‌న్ రికార్డుల‌ను తిర‌గ‌రాస్తుంది. కేజీఎఫ్ చాప్ట‌ర్2 నుంచి హోంబ‌లే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ వ‌రుస‌గా వీడియో పాట‌ల‌ను రిలీజ్ చేస్తుంది. ప్ర‌స్తుతం ర‌ణ ర‌ణ ర‌ణధీరా... సుల్తానా వీడియో పాటను రిలీజ్ చేశారు.

Sulthana Video Song:  ర‌ణ ర‌ణ ర‌ణధీరా వీడియో సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. మాస్ మ్యూజిక్‌తో ప్రేక్ష‌కుల‌కు మ‌రోసారి గూస్ బంప్స్ తెప్పిస్తుంది. రామ‌జోగయ్య శాస్త్రి ఈ పాట‌ను రాశారు. ర‌వి బ‌స్రూర్ సంగీతం అందించారు. తూరుపు వైపుకు న‌డిపించంటూ రామ జోగ‌య్య శాస్త్రి అందించిన లిరిక్స్ ఈ పాట‌లో అద్భుతంగా అనిపించాయి. ర‌ణ ర‌ణ ర‌ణధీరా పాట లిరిక్స్ మీ కోసం. 

రణ రణ రణ రణధీరా
గొడుగెత్తె నీలి గగనాలు
రణ రణ రణ రణధీరా
పదమొత్తె వేల భువనాలు

రణ రణ రణ రణధీరా
తలవంచే నీకు శిఖరాలు
రణ రణ రణ రణధీరా
జేజేలు పలికే ఖనిజాలు

నిలువెత్తు నీ కదము
ముష్కరులపాలి ఉక్కు సమ్మెటా
అనితరము నీ పదము
అమావాస్య చీల్చు అగ్గి బావుటా

రగిలే పగిలే నిట్టూర్పులకు
నీ వెన్నుదన్నే ఓదార్పు
మా బతుకిదిగో నీకై ముడుపు
నడిపించర తూరుపు వైపు

ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ఆ ఆ

కధమెత్తిన బలవిక్రముడై
దురితమతులు పని పట్టు
పేట్రేగిన ప్రతి వైరుకలా
పుడమి ఒడికి బలిపెట్టు

ఏయ్ కట్టకటిక రక్కసుడే ఒక్కొక్కడు
వేటుకొకడు ఒరిగేట్టు వెంటపడు
సమరగమన సమవర్తివై నేడు
శత్రుజనుల ప్రాణాలపైనబడు

తథ్యముగ జరిగి తీరవలే
కిరాతక దైత్యుల వేట
ఖచ్చితముగా నీ ఖడ్గ సిరి
గురితప్పదెపుడు ఏ చోటా

రగిలే పగిలే నిట్టూర్పులకు
నీ వెన్నుదన్నే ఓదార్పు
మా బతుకిదిగో నీకై ముడుపు
నడిపించర తూరుపు వైపు

జై జై జై జై జై జై

రణ రణ రణ రణధీరా
గొడుగెత్తె నీలి గగనాలు
రణ రణ రణ రణధీరా
పదమొత్తె వేల భువనాలు

రణ రణ రణ రణధీరా
తలవంచే నీకు శిఖరాలు
రణ రణ రణ రణధీరా
జేజేలు పలికే ఖనిజాలు

నిలువెత్తు నీ కదము
ముష్కరులపాలి ఉక్కు సమ్మెటా
అనితరము నీ పదము
అమావాస్య చీల్చు అగ్గి బావుటా

రగిలే పగిలే నిట్టూర్పులకు
నీ వెన్నుదన్నే ఓదార్పు
మా బతుకిదిగో నీకై ముడుపు
నడిపించర తూరుపు వైపు

ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా
ధీర ధీర ధీర ధీరా సుర సుల్తానా ఆ ఆ

Sulthana Video Song: హీరో య‌శ్(Yash) న‌టించిన కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 సినిమాలోని ర‌ణ ర‌ణ ర‌ణధీరా వీడియో సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

KGF Chapter 2: కేజీఎఫ్‌ చాప్ట‌ర్2 ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లు వ‌సూళ్లు చేసింది. హీరో య‌శ్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి జోడి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఈ సినిమాలో పాట‌ల‌న్నీ హిట్‌గా నిలిచాయి. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌కు ప్ర‌పంచ సినిమా దిగ్గ‌జాలు స‌లాం అంటున్నారు. ఇక బాలీవుడ్ సంజ‌య్ ద‌త్ విల‌న్ పాత్ర‌లో న‌టించి.. స్పెష‌ల్ ఇమేజ్ సంపాదించుకున్నారు. హోంబ‌లే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ భారీ బ‌డ్జెట్‌తో కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 సినిమాను నిర్మించింది. ప్ర‌స్తుతం కేజీఎఫ్ చాప్ట‌ర్2 వీడియా సాంగ్స్ యూట్యూబ్‌లో దూసుకెళుతున్నాయి. . 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!