కాస్త లేటైంది అంతే.. అక్క‌డ కేజీఎఫ్ చాప్ట‌ర్‌2 (KGF Chapter 2) ద‌మ్మేంటో ఇప్పుడు తెలిసింది

Updated on May 28, 2022 10:59 PM IST
KGF Chapter 2: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో దాదాపు రూ.93 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది
KGF Chapter 2: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో దాదాపు రూ.93 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది

KGF Chapter 2: కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 ఇండియ‌న్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ఎన్నో రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది. య‌శ్ యాక్టింగ్, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం అద‌ర‌హో అని ఆడియ‌న్స్ అంటున్నారు.

కేజీఎఫ్ చాప్ట‌ర్ 2  మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు రూ.1200 కోట్ల‌కు పైగా వ‌సూళ్లను పొందింది. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఇంకా దుమ్ములేపుతూ.. ద‌మ్మున్న సినిమా అనిపించుకుంటుంది.తెలుగు రాష్ట్రాల్లో కేజీఎఫ్  చాప్ట‌ర్ 2 క‌లెక్ష‌న్ల ప‌రంగా, ముందు నుంచి కాస్త నెమ్మ‌దిగానే ఉంది.

రాను రాను తెలుగు రాష్ట్రాల్లో కేజీఎప్ చాప్ట‌ర్ 2 త‌న ఆక్యుపెన్సీని పెంచుకుంది. భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో దాదాపు రూ.93 కోట్ల‌ను వ‌సూళ్లు చేసింది. మ‌రో ఏడు కోట్ల రూపాయ‌లు వ‌సూళ్లు చేస్తే, రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంది. కేజీఎఫ్ చాప్ట‌ర్ 2 సినిమా విడుద‌లై 42 రోజులు కావస్తున్నా.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. 

య‌శ్ ఈ సినిమాలో రాఖీభాయ్‌గా న‌టించి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించారు. య‌శ్ న‌ట‌న‌కు ఫిదా అయిన ఫ్యాన్స్, ఓటీటీలో విడుదలైనా కూడా.. థియేట‌ర్ల‌ల‌తో ఈ సినిమాను చూసేందుకు మ‌ళ్లీ మ‌ళ్లీ వెళుతున్నారు. మొదటి వారం నుంచి 5 వ వారం వరకు, ఈ చిత్రానికి రూ. 1210.53 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఆరో వారంలో వరుసగా 3.10, 3.48, 4.02, 4.68, 1.87, 1.46 కోట్లు రాబ‌ట్టింది కేజీఎఫ్ చాప్ట‌ర్‌ 2.

ఇక మ‌రో అప్‌డేట్ ఏంటంటే, కేజీఎఫ్ చాప్ట‌ర్ 3 కూడా తీస్తార‌నే టాక్ వినిపిస్తోంది. అప్ప‌టి వ‌ర‌కు కేజీఎఫ్ చాప్ట‌ర్‌ 2 ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో మరి. ఆ త‌ర్వాత కేజీఎఫ్ చాప్ట‌ర్ 3 సినిమా మ‌రెన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి. అలాగే ఈ క్రమంలో ప్ర‌శాంత్ నీల్, య‌శ్‌లు ఏం ప్లాన్ చేశారో కూడా చూడాలి?

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!