ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ వ‌ల్లే 'ఇస్మార్ట్ శంక‌ర్' సాధ్య‌మైంది - రామ్ పోతినేని (Ram Pothineni)

Updated on Jul 10, 2022 03:27 PM IST
ఇస్మార్ట్ శంక‌ర్‌లానే 'ది వారియ‌ర్' సినిమాను ఆద‌రించాల‌ని రామ్ పోతినేని (Ram Pothineni) కోరారు. 
ఇస్మార్ట్ శంక‌ర్‌లానే 'ది వారియ‌ర్' సినిమాను ఆద‌రించాల‌ని రామ్ పోతినేని (Ram Pothineni) కోరారు. 

హీరో రామ్ పోతినేని (Ram Pothineni) న‌టించిన 'ది వారియ‌ర్' సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. రామ్‌తో స‌హా చిత్ర యూనిట్ 'ది వారియ‌ర్' ప్ర‌మోషన్ల‌తో బిజీగా ఉన్నారు. ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్‌పై రామ్ పోతినేని చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. రామ్ పోతినేని కొత్త సినిమా 'ది వారియ‌ర్' జూలై 14న రిలీజ్ కానుంది. 

పూరి వ‌ల్లే ఆ సినిమా సాధ్య‌మైంది - రామ్
'ది వారియ‌ర్' ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా రామ్ ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌శంసించారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో న‌టించ‌డం ఓ అదృష్టమ‌న్నారు. రామ్ పోతినేని లేక‌పోతే 'ఇస్మార్ట్ శంక‌ర్' లేదంటూ పూరి అన్నారు.. కానీ అలాంటి సినిమాను పూరి జ‌గన్నాథ్ ఒక్క‌రే తీయ‌గ‌ల‌ర‌ని రామ్ చెప్పారు. 'ఇస్మార్ట్ శంక‌ర్‌'లానే ది వారియ‌ర్ సినిమాను ఆద‌రించాల‌ని కోరారు. 

'ది వారియ‌ర్' సినిమాలో పోలీస్ పాత్ర‌లో న‌టించాన‌ని రామ్ (Ram Pothineni) తెలిపారు. పోలీస్ యూనిఫామ్‌లోనే ఓ పవర్ ఉంటుందన్నారు. ఆ పవర్ కార‌ణంగా త‌న క్యారెక్ట‌ర్ మరింత ఎన‌ర్జీతో క‌నిపిస్తుంద‌న్నారు. పోలీస్ పాత్ర‌లో న‌టించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాన‌ని.. అయితే క‌థ న‌చ్చ‌న‌ప్పుడు చేద్దామ‌ని ఆగన‌న్నారు. లింగు సామి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న 'ది వారియ‌ర్' క‌థ న‌చ్చ‌డంతో ఈ సినిమాలో న‌టించాన‌న్నారు.

ఇస్మార్ట్ శంక‌ర్ ఓ బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌
రామ్ పోతినేని (Ram Pothineni), పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంకర్' 2019 జూలై 18న విడుదలైంది. ఈ సినిమాలో హీరోయిన్లు నిధి అగర్వాల్‌, నభా నటేష్ న‌టించారు. 'ఇస్మార్ట్ శంక‌ర్' చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యాన‌ర్ల‌పై నిర్మించారు. నిర్మాత‌లుగా పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ వ్య‌వ‌హ‌రించారు. మణిశర్మ సంగీతం అందించారు.

రామ్ పోతినేని కెరీర్‌లో 'ఇస్మార్ట్ శంక‌ర్' బ్లాక్ బాస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను రూ. 20 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మించారు. విడుద‌లైన మూడు రోజుల్లో రూ. 36 కోట్ల‌ను వ‌సూళ్లు చేసి రికార్డు సృష్టించింది. మొత్తంగా రూ. 60 కోట్ల క‌లెక్ష‌న్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 'ది వారియ‌ర్' సినిమాను కూడా ఇస్మార్ట్ శంక‌ర్‌లా ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని రామ్ కోరారు,

Read More: రామ్‌తో డాన్స్ చేయాలంటే భ‌యం వేసింది : కృతి శెట్టి (Krithi Shetty)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!