రామ్‌తో డాన్స్ చేయాలంటే భ‌యం వేసింది : కృతి శెట్టి (Krithi Shetty)

Updated on Jul 05, 2022 10:02 PM IST
'ది వారియ‌ర్' సినిమా ప్ర‌మోషన్ల‌లో భాగంగా కృతి శెట్టి   (Krithi Shetty) రామ్‌పై చేసిన కామెంట్లు ఆస‌క్తిక‌రంగా అనిపించాయి.
'ది వారియ‌ర్' సినిమా ప్ర‌మోషన్ల‌లో భాగంగా కృతి శెట్టి (Krithi Shetty) రామ్‌పై చేసిన కామెంట్లు ఆస‌క్తిక‌రంగా అనిపించాయి.

టాలీవుడ్‌లో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి (Krithi Shetty) వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళుతోంది. ప్రస్తుతం కృతి శెట్టి యంగ్ హీరో రామ్ పోతినేనితో 'ది వారియ‌ర్' సినిమాలో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. 'ది వారియ‌ర్' సినిమా ప్ర‌మోషన్ల‌లో భాగంగా కృతి శెట్టి.. రామ్‌పై చేసిన కామెంట్లు ఆస‌క్తిక‌రంగా మారాయి. 'ది వారియర్' సినిమా జూలై 14న విడుద‌ల కానుంది. 

రామ్‌తో డాన్సులు నా వ‌ల్ల కాదు : కృతి శెట్టి(Krithi Shetty)
లింగుసామి ద‌ర్వ‌క‌త్వంలో 'ది వారియ‌ర్' సినిమా తెర‌కెక్కింది. అయితే, లింగుసామి డైరెక్ష‌న్‌లో రిలీజ్ అయిన 'ఆవారా'.. కృతి శెట్టికి ఇష్ట‌మైన సినిమా అని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. లింగుసామి 'ది వారియ‌ర్' సినిమా కోసం త‌న‌కు ఫోన్ చేశార‌ని.. అప్పుడు తాను ఎంతో ఆనందించాన‌ని చెబుతూ ఆమె తన సంతోషాన్ని వ్యక్తం చేసింది .

రామ్‌తో క‌లిసి ప‌నిచేయ‌డంపై కృతి శెట్టి త‌న అనుభ‌వాల‌ని చెప్పుకొచ్చింది. 'రామ్‌తో క‌లిసి న‌టించ‌గ‌ల‌ను కానీ.. డ్యాన్స్ వేసేట‌ప్పుడు మాత్రం క‌ష్టంగా ఉంటుంది. స్టెప్పులు వేసేట‌ప్పుడు  రామ్ స్పీడును అందుకోవ‌డం నాకు పెద్ద టాస్క్' అని ఆమె అభిప్రాయపడింది.

'రామ్‌తో క‌లిసి సీన్స్ ఈజీగా చేస్తాను..  కానీ ఆయనతో కలిసి పాట‌ల‌కు డాన్స్ చేయడం అంటే చాలా భ‌యం వేసేది' అని కృతి శెట్టి తన మనసులోని మాటని బయటపెట్టింది. రామ్ ఎన‌ర్జీ లెవెల్స్ చూసి మొద‌ట్లో తాను కంగారు ప‌డ్డాన‌ని తెలిపింది. 'ఫైన‌ల్‌గా రామ్‌తో ఎలాగో డాన్స్ చేసి, స్టెప్పులు మ్యాచ్ చేశాను' అంటూ కృతి ఆయనతో సెట్‌లో తనకు ఎదురైన అనుభవాలను ప్రేక్షకులతో పంచుకుంది.  

ఆదిని చూసి షాక్ అయ్యాను - కృతి శెట్టి(Krithi Shetty)
'ది వారియ‌ర్' ప్ర‌మోష‌న్ల‌లో కృతి శెట్టి రామ్‌తో పాటు, ప్రతినాయకుడు ఆది పినిశెట్టి గురించి కూడా తన అభిప్రాయాలు తెలపడం విశేషం. 'ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్‌గా చేశారు. కానీ నేను ఆయనతో క‌లిసి న‌టించిన సీన్స్ ఈ సినిమాలో లేవు. ఏదేమైనా,  సినిమాలో ఆది న‌ట‌న చూసి షాక్ అయ్యాను. బ‌య‌ట కూల్‌గా క‌నిపించే ఈ హీరో.. తెర‌పై విల‌న్‌గా అద‌ర‌గొట్టారు' అని కృతి తెలిపింది. 

'ది వారియ‌ర్' సినిమాలో రామ్ ప‌వ‌ర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో నటిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో ఈ సినిమా తెర‌కెక్కింది. శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి 'ది వారియ‌ర్' చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Read More: Ram Pothineni : రామ్ పోతినేని కథానాయకుడిగా వస్తున్న "ది వారియర్" థియేట్రికల్ ట్రైలర్ అదుర్స్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!