ఆగస్టులో విడుదల కానున్న నితిన్ (Nithin) ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా

Updated on May 09, 2022 11:15 AM IST
మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్
మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్

కొన్నాళ్లుగా సరైన హిట్​ లేక సతమతమవుతున్న హీరో నితిన్ (Nithin)​. ‘భీష్మ’ తర్వాత నితిన్​ హిట్​ కొట్టలేకపోయాడు. మూడు సినిమాలు విడుదలైనా నిరాశే మిగిలింది. నిజానికి ఇన్నేళ్ళలో నితిన్ ను విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయినా ప‌ట్టువ‌దల‌ని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆరంభంలో వరుస విజయాలు చవిచూసిన నితిన్ కు ఆ తరువాత సక్సెస్ కరువైంది.  అయినా జయాపజయాలతో నిమిత్తం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.

నితిన్ ప్రస్తుతం ఎం.ఎస్ రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో `మాచర్ల నియోజక వర్గం` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ నటిస్తున్నాడు. మాచర్ల నియోజకవర్గం ముందుగా జూలై 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే కొన్ని  కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. అయితే ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్​గా రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా రిలీజ్​ చేసిన పోస్టర్​ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో  తెలుపు చొక్కా  డెనిమ్ జీన్స్ ధరించి నితిన్ తన చొక్కా చేతులు ముడుచుకుంటూ కనిపించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  నితిన్ ముఖంలో ఎప్పుడూ చూడని  సీరియస్​నెస్​ కనిపిస్తోంది.

ప్రస్తుతం యూరప్ దేశాల్లోని ఇటలీ- ఆస్ట్రియాలోని కొన్ని సుందరమైన లొకేషన్లలో ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుగుతోంది. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయగా దానికి అనూహ్యంగా రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్ సహా వీడియోలో నితిన్ సీరియస్ అవతార్ లో కనిపించాడు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ అందించారు.

ఈ సినిమాతో ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి ద‌ర్శకుడి గా ప‌రిచ‌యం అవుతున్నారు. విభిన్న కథా కథనంతో రూపొందుతున్న `మాచర్ల నియోజకవర్గం`లో కేథరిన్ థెరిసా, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి శ్రేష్ట్ మూవీస్‌ పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఫైట్ మాస్టర్ అనల్ అరసు నేతృత్వం‌లో అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సూపర్ మాస్ డ్యాన్స్ నంబర్ కూడా పూర్తి చేసారు.

పక్కా మాస్- కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రాజకీయ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి- కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ముగ్గురు మాస్టర్స్ వెంకట్- రవివర్మ - అనల్ అరసు సినిమా యాక్షన్ పార్ట్ కు మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండేలా కొరియోగ్రఫీ చేసారు. భీష్మ తర్వాత మళ్లీ అదే జోష్ తో నిరూపించాలని తపిస్తున్నాడు నితిన్ (Nithin)​. మాచర్ల నియోజకవర్గంతో ఆశించినది దక్కుతుందనే అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!