చరిత్ర సృష్టించేలా నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన 'కార్తికేయ 2' సినిమా కలెక్షన్లు !

Updated on Aug 29, 2022 07:33 PM IST
నిఖిల్‌ (Nikhil)  నటించిన కార్తికేయ 2 ద్వారకా నగర రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఓ అడ్వంచర్ ఫిల్మ్
నిఖిల్‌ (Nikhil) నటించిన కార్తికేయ 2 ద్వారకా నగర రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఓ అడ్వంచర్ ఫిల్మ్

నిఖిల్ (Nikhil) హీరోగా తెరకెక్కిన సినిమా కార్తికేయ 2 (Karthikeya 2). సినిమా విడుదల రెండుసార్లు వాయిదా పడడంతో అంచనాలు కూడా తగ్గాయనే చెప్పుకోవాలి. అయితే కార్తికేయ2 సినిమా విడుదలైనప్పుడు కలెక్షన్స్ మామూలుగానే వస్తాయి అని అనుకున్నారు అందరూ.  అయితే కార్తికేయ2  సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది. 

లాభాల బాటలో నిఖిల్ చిత్రం

ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తెచ్చిన టాప్ 10 సినిమాల్లో ఒకటిగా నిలిచింది కార్తికేయ 2 (Karthikeya 2). ఇప్పటికే ఈ సినిమాకు రూ.36 కోట్ల లాభం వచ్చింది. అది కూడా కేవలం కలెక్షన్ల రూపంలోనే రావడం గమనించాల్సిన విషయం. 

తెలుగుతోపాటు హిందీలో కూడా కార్తికేయ 2 (Karthikeya 2) సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంతేకాదు భారీ అంచనాల మధ్య ఈ వారం రిలీజైన విజయ్ దేవరకొండ లైగర్‌‌ సినిమాను కూడా వెనక్కు నెట్టేసింది కార్తికేయ 2 సినిమా. 

16 రోజుల కలెక్షన్లు ఎన్ని కోట్లు అంటే.. 

నైజాం: 11.57 కోట్లు

సీడెడ్: 4.51 కోట్లు

ఉత్తరాంధ్ర: 4.01 కోట్లు

ఈస్ట్: 2.32 కోట్లు

వెస్ట్: 1.47 కోట్లు

గుంటూరు: 2.51 కోట్లు

కృష్ణా: 2.00 కోట్లు

నెల్లూరు: 0.99 కోట్లు

ఏపీ, తెలంగాణ 16 డేస్ కలెక్షన్స్: 29.50 కోట్లు

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 2.55 కోట్లు

హిందీ: 11.80 కోట్లు

ఓవర్సీస్: 5.55 కోట్లు

వరల్డ్ వైడ్ 16 డేస్ కలెక్షన్స్: 48.89 కోట్లు

కార్తికేయ 2 సినిమాను ప్రపంచవ్యాప్తంగా రూ.13 కోట్లకు అమ్మేశారు మేకర్స్. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా కలెక్షన్స్ సేఫ్ జోన్‌లోకి వచ్చాయి. ఇప్పటివరకు దాదాపు  రూ.50 కోట్ల షేర్ వసూలు చేసింది కార్తికేయ 2  (Karthikeya 2) సినిమా. దాంతో రూ.37 కోట్ల లాభాలను ఆర్జించింది. 

Read More : 'కార్తికేయ 2' స‌క్సెస్ సంబురాలు... గ‌ర్వంగా ఉందన్న హీరో నిఖిల్(Nikhil Siddhartha)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!