దసరా స్పెషల్: ఓటీటీలో ‘కార్తికేయ 2’ (Karthikeya 2).. ఈరోజు నుంచే స్ట్రీమింగ్

Updated on Oct 06, 2022 03:23 PM IST
‘కార్తికేయ 3’ (Karthikeya 3)ని పాన్ వరల్డ్ స్థాయిలో భారీగా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు
‘కార్తికేయ 3’ (Karthikeya 3)ని పాన్ వరల్డ్ స్థాయిలో భారీగా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha) హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ఘన విజయాన్ని సాధించింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతోపాటు హిందీలోనూ బంపర్ హిట్‌గా నిలిచింది. తక్కువ బడ్జెట్‌లో పెద్దగా అంచనాలు లేకుండా పంద్రాగస్టు కానుకగా రిలీజైన ‘కార్తికేయ 2’ మూవీ.. ఉత్తరాదిన కలెక్షన్లతో దుమ్మురేపింది. తద్వారా నిఖిల్‌కు సరికొత్త మార్కెట్‌ను ఏర్పర్చింది. మొత్తంగా ఈ సినిమా 100 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. 

ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్

థియేటర్లలో సందడి చేసిన ‘కార్తికేయ 2’.. ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా చాలా మంది ఎదురు చూస్తున్నారు. వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దసరా కానుకగా ఇవాళ్టి నుంచి ‘కార్తికేయ 2’ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడనివారు లేదా ఈ చిత్రాన్ని మళ్లీ చూడాలనుకునే వారు ఈరోజు నుంచి జీ5లో చూడొచ్చు. 

నిఖిల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘కార్తికేయ 2’లో బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్‌తోపాటు కమెడియన్స్ శ్రీనివాస్‌ రెడ్డి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు. నిఖిల్ పక్కన హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలసి నిర్మించారు. 

కాగా, అప్పట్లో ఈ చిత్రం విడుదలపై హీరో నిఖిల్ చెప్పిన కారణాలు ఆశ్చర్యం కలిగించాయి. త‌న‌కు ఇండ‌స్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు కాబ‌ట్టే.. త‌న సినిమా వాయిదా ప‌డుతూ వ‌చ్చింద‌న్నారు. త‌న సినిమా విడుద‌ల కాకుండా కొంద‌రు కావాల‌నే అడ్డుకున్నార‌ని నిఖిల్ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో పెద్ద దుమార‌మే రేపాయి. 

భారీ బడ్జెట్‌తో కార్తికేయ‌‌‌‌–3

‘కార్తికేయ 2’ సినిమాకు మరో సీక్వెల్ కూడా రానుందనే విషయం తెలిసిందే. దర్శకుడు చందూ మొండేటి ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిఖిల్.. 'కార్తికేయ-3' (Karthikeya 3) సినిమాపై ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. కార్తికేయ-3 చిత్రాన్ని మరింత భారీ బడ్జెట్‌తో, భారీ క్యాస్టింగ్‌తో పాన్ వరల్డ్ మూవీగా తీయబోతున్నామని తెలిపారు.

Read more: 'కార్తికేయ-3' (Karthikeya 3) 3Dలో రిలీజ్ చేస్తాం.. హీరో నిఖిల్ (Nikhil Siddarth) ఆసక్తికర అప్ డేట్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!