Tollywood: ఈ వారం థియేటర్లలో, (OTT) ఓటీటీలో విడుదల కాబోతున్న చిత్రాలివే..!

Updated on Jul 26, 2022 07:20 PM IST
ఈ వారం ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సరికొత్త చిత్రాలు, పలు వెబ్ సిరీస్‌‌లు (Web Series)  రెడీ అయ్యాయి.
ఈ వారం ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సరికొత్త చిత్రాలు, పలు వెబ్ సిరీస్‌‌లు (Web Series) రెడీ అయ్యాయి.

Tollywood: టాలీవుడ్‌లో సినీ ప్రియుల కోసం ప్రతివారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలయి అలరిస్తుంటాయి. ఈ ఏడాది వేసవి‌లో పెద్ద సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. ఇక ఆ తర్వాత వచ్చిన చిత్రాలు అంతగా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయాయి. అయితే, ఓటీటీ (OTT) ప్లాట్ ఫామ్‌లు వచ్చాక, ప్రతి సినిమా కూడా థియేటర్లలో విడుదలై.. నాలుగు లేదా ఆరు వారాలలోపే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.

దీంతో చాలామంది థియేటర్లకంటే ఓటీటీ లోనే సినిమాలు చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. థియేటర్లలో పెరిగిన టికెట్ రేట్లను బట్టి ఎక్కువ ఖర్చు పెట్టి. కుటుంబ సభ్యులతో సహా వెళ్లి సినిమాలు చూడలేరు. కాబట్టి ఇలా ఇంట్లోనే అందరితో కలిసి సంతోషంగా సినిమాలు చూస్తూ, ఓటీటీలకే పరిమితమయ్యారు ప్రేక్షకులు.

ఈ నేపథ్యంలో ఈ వారం ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సరికొత్త చిత్రాలు, పలు వెబ్ సిరీస్‌లు (Web Series)   రెడీ అయ్యాయి.  వాటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం...

థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు:

  • విక్రాంత్ రోణ (కిచ్చా సుదీప్) – జులై 28
  • ద లెజెండ్ (అరుల్ శరవణన్) – జులై 28
  • రామారావు ఆన్ డ్యూటీ (రవితేజ) – జులై 29
  • ఏక్ విలన్ రిటర్న్స్ (జాన్ అబ్రహం) – జులై 29

ఓటీటీలో రిలీజ్ అయ్యే చిత్రాలు:

అమెజాన్ ప్రైమ్ వీడియో:

  • రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్ (ఆర్.మాధవన్) – జులై 26
  • ద బ్యాట్ మ్యాన్ (హాలీవుడ్) – జులై 27

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney Plus Hotstar):

  • గుడ్ లక్ జెర్రీ (జాన్వీ కపూర్) – జులై 29

వూట్ (Voot):

  • 777 చార్లీ (రక్షిత్ శెట్టి) – జులై 29

ఆహా వీడియో (Aha Video):

  • షికారు (తెలుగు) – జులై 29

జీ 5 (Zee5):

  • పేపర్ రాకెట్ (తెలుగు) – జులై 29

నెట్ ఫ్లిక్స్ (Netflix):

  • మసాబా మసాబా (హిందీ వెబ్ సిరీస్) – జులై 29

 

Read More: మహేష్ బాబు - త్రివిక్రమ్ (Mahesh-Trivikram) సినిమా నుంచి బిగ్ అప్ డేట్.. తొలి సారి డబుల్ రోల్‌లో సూపర్ స్టార్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!