Thank you: నాగ‌చైత‌న్య (Naga chaitanya) 'థ్యాంక్యూ' మొద‌టి రోజు క‌లెక్ష‌న్ ఎంతంటే !

Updated on Jul 23, 2022 06:07 PM IST
నాగ చైత‌న్య (Naga Chaitanya) 'థ్యాంక్యూ' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 2.16 కోట్లు షేర్  రాబ‌ట్టింది.
నాగ చైత‌న్య (Naga Chaitanya) 'థ్యాంక్యూ' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 2.16 కోట్లు షేర్ రాబ‌ట్టింది.

Thankyou: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైత‌న్య (Naga Chaitanya) న‌టించిన 'థ్యాంక్యూ' చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది.  'మ‌నం' చిత్రం త‌ర్వాత నాగ‌చైత‌న్య, విక్ర‌మ్ కె. కుమార్ కాంబోలో విడుద‌లైన చిత్రం 'థ్యాంక్యూ'.

శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా న‌టించారు. 'థ్యాంక్యూ' సినిమా మొద‌టి రోజు క‌లెక్ష‌న్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

థ్యాంక్యూ క‌లెక్ష‌న్ వివ‌రాలు..

  • నైజాం - రూ. 72 ల‌క్ష‌లు
  • సీడెడ్ - రూ. 20 ల‌క్ష‌లు
  • ఉత్త‌రాంధ్ర - రూ. 22 ల‌క్ష‌లు
  • ఈస్ట్ - రూ. 14 ల‌క్ష‌లు
  • వెస్ట్ - రూ. 8 ల‌క్ష‌లు
  • గుంటూరు - రూ. 10 ల‌క్ష‌లు
  • కృష్ణా - రూ. 12 ల‌క్ష‌లు
  • నెల్లూరు - రూ. 7 ల‌క్ష‌లు

తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో క‌లిపి ఈ చిత్రం రూ. 1.65 కోట్లు షేర్  రాబ‌ట్టింది. గ్రాస్ వ‌సూళ్ల ప‌రంగా రూ. 2.70 కోట్ల బిజినెస్ చేసింది.

నాగ చైత‌న్య (Naga Chaitanya) 'థ్యాంక్యూ' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 2.16 కోట్లు షేర్ రాబ‌ట్టింది.

నాగ చైత‌న్య (Naga Chaitanya) న‌టించిన  'థ్యాంక్యూ' చిత్రం ఇండియాలోని మిగ‌తా రాష్ట్రాల్లో రూ. 6 ల‌క్ష‌లు వ‌సూళ్లు చేసింది. ఓవ‌ర్‌సీస్‌లో రూ.45 ల‌క్ష‌లు బిజినెస్ చేసింది. 'థ్యాంక్యూ' సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 2.16 కోట్ల షేర్ .. గ్రాస్ ప‌రంగా రూ. రూ.3.70 కోట్ల వ‌సూళ్లను రాబ‌ట్టింది. వారాంతంలో సినిమా  కలెక్షన్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ నిపుణులు

Read More: "థ్యాంక్యూ ట్విట్ట‌ర్ రివ్యూ" - బంగార్రాజు మ‌ళ్లీ హిట్‌ కొట్టాడంటూ నాగ‌చైత‌న్య (Naga Chaitanya)పై ప్ర‌శంస‌లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!