మీరు సెల్ఫీలు ఆపితేనే ప్రసంగిస్తా.. చిరు (Chiranjeevi Konidela)పై గరికపాటి (Garikipati Narasimha Rao) అసహనం 

Updated on Oct 07, 2022 12:08 PM IST
చిరంజీవి (Chiranjeevi Konidela) ఫొటోలు దిగడం ఆపకపోతే తాను వెళ్లిపోతానని గరికపాటి (Garikipati Narasimha Rao) హెచ్చరించారు. 
చిరంజీవి (Chiranjeevi Konidela) ఫొటోలు దిగడం ఆపకపోతే తాను వెళ్లిపోతానని గరికపాటి (Garikipati Narasimha Rao) హెచ్చరించారు. 

హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ దసరా పండుగ సందర్భంగా గత కొన్నేళ్లుగా ‘అలయ్ బలయ్’ (Alai Balai) కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆయన ఆహ్వానిస్తుంటారు. ఆత్మీయ ఆలింగనం ప్రాధాన్యాన్ని,  తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని గురించి తెలిపేలా ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ ఘనంగా జరుపుతుంటారు. 

ఈ ఏడాది కూడా ‘అలయ్ బలయ్’కు రావాల్సిందిగా పలువురు ప్రముఖులను దత్తాత్రేయ ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇందులో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela)పై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు (Garikipati Narasimha Rao) అసహనం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 

మీరు ఫొటోలు దిగడం ఆపకుంటే వెళ్లిపోతా

‘అలయ్‌ బలయ్‌’ వేదికపై గరికపాటి ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో కార్యక్రమానికి హాజరైన చిరంజీవితో కొందరు అభిమానులు సెల్ఫీలు దిగుతున్నారు. ఇది నచ్చని గరికపాటి ‘ఫొటో సెషన్‌ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ హెచ్చరించారు. దీంతో అక్కడున్నవారు ఆయనకు సర్దిచెప్పారు. కాసేపటికి చిరు వేదిక మీదకు రావడంతో గరికపాటి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. 

ఇకపోతే, ‘అలయ్ బలయ్’లో పాల్గొన్న గరికపాటి.. ఎప్పటిలాగే మంచి సందేశంతో ప్రసంగాన్ని ముగించారు. మనం మనుషులమనే ప్రాథమిక ఉద్దేశాన్ని గుర్తు చేయడమే తన ఉద్దేశమని ఆయన అన్నారు. దేహం మీద ప్రేమను విడిచిపెట్టినప్పుడే దేశం కోసం అందరమూ ఏకమవుతామని చెప్పారు. మనిషిని మనిషిగా ప్రేమించాలని.. అలయ్ బలయ్ ఉద్దేశం కూడా అదేనని స్పష్టం చేశారు. 

గరికపాటి ప్రసంగం అనంతరం చిరంజీవి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రేమను ఎంత ఇస్తామో, అంతే తిరిగి తీసుకుంటామని చిరు అన్నారు. తాను దాన్నే నమ్ముతానని.. ఎప్పటి నుంచో ఆచరిస్తున్నానని పేర్కొన్నారు. ‘రాజకీయాల్లోకి వచ్చాక.. రక్తం అమ్ముకుని జీవిస్తున్నానని కొందరు నన్ను విమర్శించారు. నేను దీనిపై ఎప్పుడూ స్పందించలేదు. సత్యం తెలుసుకున్నాక వాళ్లే మన దగ్గరికు వస్తారని నమ్మాను. చివరకు అదే నిజమైంది. ప్రేమకు ఉన్న ప్రభావం అది. ప్రేమతోనే అన్నింటినీ జయించాలి. అలయ్ బలయ్ ఉద్దేశం కూడా అదే’ అని చిరంజీవి చెప్పారు. ఇకపోతే, చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

Read more: Punnaminagu: చిరంజీవి నటించిన "పున్నమినాగు" చిత్రం గురించిన టాప్ 10 ఆసక్తికరమైన విశేషాలివే!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!