గణేష్ నిమజ్జన వేడుకల్లో సందడి చేసిన అల్లు అర్జున్(Allu Arjun) .. తగ్గేదేలే అంటున్న అల్లు అర్హా
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. కూతురు అల్లు అర్హతో కలిసి 'గణపతి బప్పా మోరియా ' అంటూ సందడి చేశారు. అల్లు అర్జున్ నివాసం దగ్గరలో కాలనీ వాసులు గణేష్ విగ్రహాన్ని పెట్టారు. నిమజ్జన కార్యక్రమానికి అల్లు అర్జున్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన కూతురుతో కలిసి అల్లు అర్జున్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గణేష్ నిమజ్జన వేడుకల్లో బన్ని
సినీ రంగం వారికి దైవ భక్తి కూడా ఎక్కువే ఉంటుంది. ఏ సినిమా మొదలు పెట్టినా, పూజా కార్యక్రమంతోనే ప్రారంభిస్తారు. ఇక వినాయక చవితి టైంలో నటీనటులంతా గణేష్‌ను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తమ సినిమాలకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని కోరుకుంటారు. ఇటీవలే టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కూడా తన కూతురితో కలిసి గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.
డాన్స్ చేసిన అల్లు అర్హా
అల్లు అర్జున్ (Allu Arjun) కు భారత సంప్రదాయాలు, సంస్కృతిపై ఎంతో గౌరవం ఉందంటూ నెటిజన్లు అంటున్నారు. తన ఇంట్లోని వినాయకుడి విగ్రహాన్ని అల్లు అర్జున్ కాలనీ వాసులకు అందజేశారు. కూతురుతో కలిసి 'గణపతి బప్పా మోరియా ' అంటూ సందడి చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకుడికి వీడ్కోలు పలికారు. ఇక అల్లు అర్హా డాన్సులతో, బాండ్ వాయిస్తూ అందరినీ ఆకట్టుకుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాన్నిఇటీవలే నిర్వహించారు. ‘పుష్ప : ది రూల్’ (Pushpa The Rule) సినిమాను దర్శకుడు సుకుమార్ ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించనున్న ఈ సినిమాను రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు