Nayanthara: నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతుల కొత్త ప్లాన్.. థాయిలాండ్‌లో 'హనీమూన్' యాత్ర !

Updated on Jun 20, 2022 09:43 PM IST
దక్షిణాది అందాల తార నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ల వివాహం ఇటీవలే మహాబలిపురంలో జరిగిన సంగతి తెలిసిందే.
దక్షిణాది అందాల తార నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ల వివాహం ఇటీవలే మహాబలిపురంలో జరిగిన సంగతి తెలిసిందే.

దక్షిణాది అందాల తార నయనతార (Nayanthara), దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ల వివాహం ఇటీవలే మహాబలిపురంలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ దంపతులు తమ హనీమూన్‌ను థాయిలాండ్‌లో జరుపుకోవడానికి ప్లాన్ చేశారట. ఇదే క్రమంలో ఈ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను ఈ కపుల్ సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకున్నారు. 

జూన్ 9 వ తేదిన నయనతార (Nayanthara), విఘ్నేశ్‌ల వివాహం అంగరంగవైభవంగా జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ, సూపర్ స్టార్ రజనీకాంత్, అజిత్, దళపతి విజయ్ మొదలైన సినీ ప్రముఖులందరూ ఈ వివాహ వేడుకకు హాజరవ్వడం విశేషం. అలాగే ఈ వివాహ వేడుకను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు గాను నయన్ దంపతులు ప్లాన్ చేశారని.. దీనిని షూట్ చేయడానికి దర్శకుడు గౌతమ్ మీనన్‌ను సంప్రదించారని వార్తలొచ్చాయి. 

వివాహమయ్యాక, నయనతార (Nayanthara) దంపతులు తమ చిత్రాలను అడపా దడపా సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. నయనతారను ఉద్దేశిస్తూ విఘ్నేశ్ ఓ పోస్టును కవితాత్మకమైన రీతిలో సైతం షేర్ చేశారు. "నయన్ మామ్.. తర్వాత కాదంబరి.. తర్వాత తంగమే.. ఆ తర్వాత నా బేబీ.. ఆ తర్వాత.. ప్రేయసి.. కణ్మణి.. ఇప్పుడు నా భార్య"  అని నయనతారను పొగుడుతూ విఘ్నేశ్ పలు పోస్టులను ట్విటర్‌లో షేర్ చేశారు. 

నయనతార (Nayanthara) దంపతులు తమ వివాహం జరగగానే, తొలుత తిరుపతికి వెళ్లి బాలాజీ దర్శనాన్ని చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత కొచ్చికి వెళ్లి తమ అభిమాన రెస్టారెంటులో అరేబియన్ ఫుడ్‌ని టేస్ట్ చేశాక.. ఈ దంపతులు కేరళలోని చిట్టికులంగర దేవి గుడిని కూడా సందర్శించారట. 

ఇక వర్క్ విషయానికి వస్తే, నయనతార తన తదుపరి సినిమాని హీరో అజిత్‌తో చేస్తున్నారు. ఈ సినిమాకి విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నయనతార చాలా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'జవాన్' చిత్రంతో పాటు, చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్'.. అలాగే 'గోల్డ్' అనే మరో చిత్రంలో కూడా నయనతార నటిస్తున్నారట. 

Read More:  Nayanthara : నయనతార నటనా ప్రతిభను చాటిన.. టాప్ 10 చిత్రాలు మీకోసం ప్రత్యేకం !

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!