ఆ మూడు వేషాలు తప్ప అన్నీ వేస్తా.. షూటింగ్ లేకపోతే అస్సలు ఉండలేను: శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar)

Updated on Oct 27, 2022 03:56 PM IST
సినిమాలే తన ప్రపంచం అని ప్రముఖ క్యారెక్టర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) అన్నారు 
సినిమాలే తన ప్రపంచం అని ప్రముఖ క్యారెక్టర్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar) అన్నారు 

టాలీవుడ్‌ (Tollywood)లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar). విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తానేంటో ఆయన నిరూపించుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన అవకాశాలను ఆయన రెండు చేతులతో ఒడిసి పట్టుకుంటున్నారు. అందుకే వరుసగా ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి శ్రీకాంత్ అయ్యంగార్ తనకు సినిమాలపై ఉన్న ఇష్టం, తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సినిమాలంటే తనకు చాలా పిచ్చి అని ఆయన అన్నారు. 

సినిమానే తన ప్రపంచం అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పారు. మూవీ ఏదైనా.. షూటింగ్ ఎక్కడైనా సెట్లో అందరితో కలసిపోయి పనిచేయడం తనకు అలవాటు అని ఆయన అన్నారు. ఎవరైనా ఇగో చూపిస్తే.. వాళ్లకు దూరంగా ఉంటానని శ్రీకాంత్ అయ్యంగార్ పేర్కొన్నారు. ‘సినిమానే నా ప్రపంచం. సెట్లో అడుగుపెట్టేటప్పుడు నేను పొందే సంతోషం అంతా ఇంతా కాదు. రేపు షూటింగ్ ఉందని చెబితే.. ఈ రోజు నేను గాల్లో తేలిపోతా. నాతో కుటుంబ సభ్యులు లేకపోయినా.. భోజనం లేకపోయినా ఉండగలను. కానీ సినిమాల్లేకుండా మాత్రం ఉండలేను’ అని శ్రీకాంత్ అయ్యంగార్ చెప్పుకొచ్చారు. 

విలక్షణమైన పాత్రల్లో నటించడం అంటే తనకు ఇష్టమని శ్రీకాంత్ అయ్యంగార్ అన్నారు. ‘నేను ఏ తరహా రోల్స్‌కు సెట్ అవుతాననేది దర్శకులకు తెలుసు. ఆ తరహా పాత్రలే నాకు ఇస్తారు. వాటిల్లో నచ్చిన క్యారెక్టర్లను చేసుకుంటూ వెళ్లిపోతున్నా. అయితే ఒక విషయంలో మాత్రం జాగ్రత్తపడతా. నేను చేసే పాత్రల్లో కొత్తదనం ఉండేలా చూసుకుంటా. హీరో వేషం వేయను. హీరోయిన్ రోల్ కూడా చేయను. చిన్న పిల్లల వేషం అసలే వేయను. ఈ మూడు తప్ప అన్ని వేషాలు వేస్తాను’ అని శ్రీకాంత్ అయ్యంగార్ వివరించారు. ఇకపోతే, ‘బ్రోచేవారెవరు రా’, ‘అంటే సుందరానికీ’, ‘చావు కబురు చల్లగా’ చిత్రాలు శ్రీకాంత్ అయ్యంగార్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆయన ప్రస్తుతం పలు సినిమాల షూటింగులతో బిజీబిజీగా ఉన్నారు. 

Read more: చిరు (Chiranjeevi Konidela) సినిమా వెయ్యి కోట్లు రాబట్టాలి.. అదే ఆయన ఇమేజ్‌కు తగిన చిత్రం: తమ్మారెడ్డి భరద్వాజ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!