ఓటీటీలోకి నేచురల్ స్టార్ నాని (Natural Nani) ‘అంటే సుందరానికీ’ సినిమా? ఎప్పటి నుంచి అంటే..
నేచురల్ స్టార్ నాని (Natural Nani), నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్యామిలీ, ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. నజ్రియా మొదటిసారిగా తెలుగులో నటించింది. జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అంటే సుందరానికీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది.
అయితే కలెక్షన్స్ విషయంలో మాత్రం కొద్దిగా వెనుకబడింది. ఇప్పటివరకూ థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించిన అంటే సుందరానికీ సినిమా మరికొన్నిరోజుల్లో ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై బుధవారం అప్‌డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
సినిమా కథేంటంటే..!
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్ (నాని) అనే యువకుడు కుటుంబ ఆచార వ్యవహారాలతో విసిగిపోతుంటాడు. చిన్నప్పటి నుంచి అతనికి లీల (నజ్రియా) అంటే ఇష్టం. ఇద్దరూ కలిసి చదువుకుంటారు. కెరీర్‌లో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. సుందర్ తండ్రి శాస్త్రి (నరేష్), లీల తండ్రి థామస్ (అజఘం పెరుమాల్)కు వాళ్ల మతం తప్పితే మరో మతం అంటే నచ్చదు. భిన్న కుటుంబాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, మతాచారాల మధ్య ప్రేమికులుగా సుందర్, లీలా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వాళ్ల ప్రేమను గెలిపించుకోవడానికి ఎటువంటి ప్లాన్స్ వేశారు? ఎలా ఒక్కటయ్యారు? అనే కథతో ఈ సినిమాను ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. నాని (Natural Nani), నజ్రియా నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.