EXCLUSIVE: ఆనాడు బాలరాముడు.. నేడు కొమురం భీముడు , జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) నటనకు వన్నె తెచ్చిన అవార్డులెన్నో !

Updated on Oct 19, 2022 05:12 PM IST
తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ (Junior NTR)  "ఇంతింతై వటుడింతై" అన్నట్లుగా నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ (Junior NTR) "ఇంతింతై వటుడింతై" అన్నట్లుగా నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) నటనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పాత్రలకు తగినట్టుగా నటించి మెప్పించడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తాత, తండ్రుల నుంచి నటనను వారసత్వంగా తీసుకున్న గొప్ప నటుడు ఎన్టీఆర్. 

బాల నటుడిగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి "ఇంతింతై వటుడింతై" అన్నట్లుగా "ఆర్ఆర్ఆర్" చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బాలనటుడిగా నటించిన "రామాయణం" చిత్రానికి ఏకంగా జాతీయ అవార్డు లభించడం విశేషం.  సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ అవార్డులపై పింక్ విల్లా ప్రత్యేక కథనం. 

తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ (Junior NTR)

రాజమౌళి డైరెక్షన్‌లో తొలిసారిగా..

జానియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా "నిన్ను చూడాలని". ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా 2001లో విడుదలై ఓ మోస్తరుగా ఆడింది. అదే సంవత్సరం రాజమౌళి దర్శకత్వంలో "స్టూడెంట్ నంబర్ 1" సినిమా కూడా విడుదలైంది.  

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తనను హంతకుడిగా చూసే తండ్రి కేసునే టేకప్ చేసే యువ న్యాయవాదిగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో చాలా పరిణితితో కూడిన పాత్రను పోషించారు. 

తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ (Junior NTR)

రికార్డులు తిరగరాసిన "ఆది"

2002లో ఎన్టీఆర్ నటించిన "ఆది" సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాతో వి.వి. వినాయక్ దర్శకుడిగా పరిచయమయ్యారు. "ఆది" సినిమాలో నటించిన జూనియర్ ఎన్టీఆర్‌కు నంది అవార్డు లభించింది. అంతేకాకుండా ఆయన "సినీ మా" అవార్డు కూడా అందుకున్నారు. 

అలాగే అదే సినిమాకు గాను ఎన్టీఆర్ "ఫిలిమ్ ఫేర్ సౌత్ అవార్డుల"లో ఉత్తమ నటుడి కేటగిరిలో నామినేట్ అయ్యారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆదికేశవరెడ్డి పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. తన నటనా పటిమను చూపించారు.

తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ (Junior NTR)

"సింహాద్రి"తో సూపర్ సక్సెస్

2003లో విడుదలైన "సింహాద్రి" సినిమాకు గానూ బెస్ట్ యాక్టర్‌గా సినీ మా అవార్డు, ఎఫ్ఎన్‌సీసీ అవార్డులను ఎన్టీఆర్ అందుకున్నారు. ఈ అవార్డులతో పాటు సంతోషం ఫిలిమ్ అవార్డుల కేటగిరీలో ఉత్తమ నటనా  పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో తమిళనాడులో సత్తా చాటే ఆంధ్రా యువకుడిగా.. "సింగమలై" పాత్రలో ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ (Junior NTR)

"యమదొంగ" చిత్రంలో తొలిసారిగా పౌరాణిక పాత్రలో..

2007లో విడుదలైన "యమదొంగ" సినిమాలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు గానూ ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడిగా ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది. అంతేకాకుండా సినీ మా అవార్డ్స్,  జెమినీ  వారి బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా లభించాయి. ఈ చిత్రంలో యుముడి పీఠానికే ఎసరు పెట్టే మానవుడిగా ఎన్టీఆర్ పోషించిన పాత్ర నభూత్ నభవిష్యత్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో యముడి పాత్రలో సీనియర్ నటులు మోహన్ బాబు నటించగా.. ఆయనతో పోటాపోటీగా జూనియర్ ఎన్టీఆర్ నటించడం విశేషం.

ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించిన "టెంపర్"
"టెంపర్" సినిమాలో నటించిన ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడుగా "సినీమా" అవార్డు లభించింది. ఈ చిత్రంలో ఒకవైపు అవినీతిపరుడైన పోలీస్ అధికారిగా.. మరోవైపు రేపిస్టులకు బుద్ధి చెప్పే మార్పు చెందిన మనిషిగా ఎన్టీఆర్ పాత్రలో మనకు భిన్న కోణాలు కనిపిస్తాయి. 

తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ (Junior NTR)

ఎన్టీఆర్ కెరీర్‌‌లో మరో సంచలనం "నాన్నకు ప్రేమతో"
2016 సంవత్సరం ఎన్టీఆర్‌కు బాగా కలిసి వచ్చింది. "నాన్నకు ప్రేమతో" సినిమాకు అవార్డుల పంట పడింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు బెస్ట్ యాక్టర్‌గా ఫిలిమ్ ఫేర్‌‌తో పాటు, నంది అవార్డును కూడా ఎన్టీఆర్ అందుకున్నారు. తండ్రి ఆశయాన్ని గెలిపించేందుకు పోరాడే ఓ కొడుకుగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటన అసామాన్యం అనే చెప్పవచ్చు. 

"నాన్నకు ప్రేమతో" సినిమాలో "ఫాలో ఫాలో సాంగ్" పాడినందుకు గానూ  స్టార్ సింగర్‌గా "మిర్చి మ్యూజిక్ అవార్డ్స్" వారి ప్రత్యేక పురస్కారాన్ని కూడా అందుకున్నారు ఎన్టీఆర్. అలాగే కన్నడ భాషలో పాడిన "గెలయా గెలయా" పాటకు కూడా ఎన్టీఆర్ ఉత్తమ గాయకుడిగా పురస్కారాన్ని అందుకున్నారు. 

తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ (Junior NTR)

మోహన్ లాల్‌తో "జనతా గ్యారేజ్"లో..
"జనతా గ్యారేజ్" సినిమాకు గానూ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా నంది అవార్డుతో పాటు.. సైమా, ఐఫా ఉత్సవాలలో పురస్కారాలను కూడా పొందారు. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు మంచి పోటీ ఇస్తూ, జూనియర్ ఎన్టీఆర్ పోషించిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. 

తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్ (Junior NTR)

"కొమురం భీమ్" పాత్రలో సత్తా చాటిన యంగ్ టైగర్
ఇటీవలే విడుదలైన "ఆర్ఆర్ఆర్" (RRR) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తన నట విశ్వరూపం మరోసారి చూపించారు. కొమురం భీముడి పాత్రలో ఎన్టీఆర్ ఒదిగిపోయారు. తెలంగాణలో గోండుల హక్కులపై పోరాడిన విప్లవకారుడు కొమురం భీమ్‌ను పోలి ఉంటుంది ఈ పాత్ర. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఆస్కార్ రేంజ్‌లో ఉందంటూ ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఎన్టీఆర్‌‌ను ఎన్ని అవార్డులు వరిస్తాయో వేచి చూడాల్సిందే.

Read More: RRR: 'భీమా నిన్ను క‌న్న నేల త‌ల్లి గ‌ర్వ‌ప‌డుతుంది'... ఇజ్రాయెల్ ప‌త్రిక‌ల్లో ఎన్టీఆర్( NTR) క‌థ‌నాలు

Advertisement
Credits: Wikipedia

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!