Naga Chaitanya: 'డీజే టిల్లు' (DJ Tillu) సినిమా డైరెక్టర్ విమల్ కృష్ణ‌తో (Vimal Krishna) నాగచైతన్య చర్చలు..!

Updated on Aug 06, 2022 01:12 PM IST
నాగ‌చైత‌న్య (Naga Chaitanya)కు ఓ క‌థ వినిపించాడ‌ట విమ‌ల్ కృష్ణ‌ (Vimal Krishna). ఈ క‌థ చైతూకు కూడా బాగా న‌చ్చింద‌ని టాక్‌ నడుస్తోంది.
నాగ‌చైత‌న్య (Naga Chaitanya)కు ఓ క‌థ వినిపించాడ‌ట విమ‌ల్ కృష్ణ‌ (Vimal Krishna). ఈ క‌థ చైతూకు కూడా బాగా న‌చ్చింద‌ని టాక్‌ నడుస్తోంది.

టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే 'థాంక్యూ' (Thankyou Movie) సినిమాతో ప్రేక్షకులను అలరించాడు చైతన్య. ఇక ప్రస్తుతం 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇ‍వ్వనున్నాడు. ఈ సినిమా ఆగ‌స్టు 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో (Mahesh Babu) .. 'సర్కారువారి పాట' సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ ప‌ర‌శురాంతో ఇంకో సినిమా చేయ‌బోతున్నాడు చైతూ. ఈ సినిమాకు ముందే బీటౌన్‌ ఆడియెన్స్‌కు చైతూ దగ్గరవ్వడం విశేషం. ఏదేమైనా, ఈ అక్కినేని వారసుడు భవిష్యత్తులో మరిన్ని హిందీ సినిమాలు చేసేందుకు పక్కాగా ప్లాన్‌ చేస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం, చైతన్య మరో తెలుగు సినిమాను లైన్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే, 'డీజే టిల్లు' సినిమాతో సత్తా చాటిన విమల్‌ కృష్ణతో నాగచైతన్య తన తర్వాతి సినిమాను చేయబోన్నట్లు ఓ టాక్‌ వినిపిస్తోంది. నాగ‌చైత‌న్యకు (Akkineni Naga Chaitanya)  ఓ క‌థ వినిపించాడ‌ట విమ‌ల్ కృష్ణ‌ (Vimal Krishna). ఈ క‌థ చైతూకు కూడా బాగా న‌చ్చింద‌ని ఇన్ సైడ్ టాక్‌ నడుస్తోంది.

ఇక, డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ (Tollywood) అగ్ర‌నిర్మాతల దృష్టిని ఆక‌ర్షించాడు ద‌ర్శ‌కుడు విమ‌ల్ కృష్ణ‌. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చైతూ ఒప్పుకున్న సినిమాలు ముగియ‌గానే.. విమ‌ల్ కృష్ణ సినిమాపై క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉంది.

అంతేకాకుండా, నాగచైతన్య ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌ పూర్తికాగానే, ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చైతూ.. మ‌రి డీజే టిల్లు (Dj Tillu) డైరెక్ట‌ర్‌తో ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడ‌నేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ గా ఉంది.

Read More: DJ Tillu Sequel: 'డీజే టిల్లు' సీక్వెల్ కు దర్శకుడు మారాడా.. సిద్దు (Siddhu), విమల్ మధ్య గొడవలే కారణమా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!