Dulquer Salmaan : దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా "కింగ్ ఆఫ్ కోతా"కు సంబంధించిన టాప్ 10 విశేషాలివే

Updated on Sep 26, 2022 03:13 PM IST
మహానటి, సీతారామం లాంటి తెలుగు సినిమాలు దుల్కర్ సల్మాన్‌కు (Dulquer Salmaan)  టాలీవుడ్‌లో కూడా మంచి పేరు తీసుకొచ్చాయి.
మహానటి, సీతారామం లాంటి తెలుగు సినిమాలు దుల్కర్ సల్మాన్‌కు (Dulquer Salmaan) టాలీవుడ్‌లో కూడా మంచి పేరు తీసుకొచ్చాయి.

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం 'సీతా రామం'తో దక్షిణాది ప్రేక్షకులతో పాటు, ఉత్తరాది ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఇటీవలే ఈయన బాలీవుడ్‌లో నటించిన 'చుప్' చిత్రం కూడా పలు రికార్డులను  బ్రేక్ చేసింది. ఈ క్రమంలో 'కింగ్ ఆఫ్ కోతా' అనే ఓ కొత్త చిత్రానికి సైన్ చేశాడు దుల్కర్ సల్మాన్. ఈ సినిమా విశేషాలు మీకోసం ప్రత్యేకం

మాస్ అవతార్‌లో
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) పూర్తి స్థాయి మాస్ పాత్రలో కనిపిస్తాడని టాక్. ఈ రోజే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఇప్పటి వరకు క్లాస్ పాత్రలనే పోషించిన దుల్కర్ సల్మాన్, ఓ మాస్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాడో వేచి చూడాల్సిందే. 

మధురైలో షూటింగ్
'కింగ్ ఆఫ్ కోతా' రెగ్యులర్ షూటింగ్ మధురై ప్రాంతంలో జరుగనుంది. అలాగే ఈ సినిమా కోసం రాయపురంలో కూడా ఓ భారీ సెట్ వేశారని టాక్. చాలా పెద్ద బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. 

అభిలాష్ జోషి దర్శకత్వంలో
వెటరన్ దర్శకుడు జోషి కుమారుడు అభిలాష్ జోషి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి అభిలాష్ ఎన్ చంద్రన్ కథను అందిస్తున్నారు. 

కథేమిటంటే
'కింగ్ ఆఫ్ కోతా' ఓ కల్పిత కథ. కోతా సామ్రాజ్యానికి రారాజుగా పిలవబడే ఓ యువకుడి కథే ఈ సినిమా. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఓ కీలక పాత్రలో నటించే అవకాశముందని అంటున్నారు. 

సమంత కథానాయికా ?
ఈ సినిమాలో కథానాయికగా సమంత నటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై నిర్మాతలు ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. 

ఐశ్వర్యాలక్ష్మి ఓ పాత్ర పోషిస్తున్నారు?
ప్రముఖ నటి ఐశ్వర్యా లక్ష్మి ఈ చిత్రంలో ఓ పాత్ర పోషిస్తున్నారట. అయితే ఈమె కథానాయికగా నటిస్తే, సమంతకు ఎలాంటి పాత్ర ఇస్తారన్నది ఓ డౌట్. 

దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్‌లో
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) సొంత బ్యానరైన "వేఫారెర్ ఫిల్మ్స్" పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని టాక్. 

స్నేహితుడి కోసం సినిమా
అభిలాష్ జోషి తన చిన్ననాటి స్నేహితుడని, అందుకే ఆయన దర్శకత్వం వహించే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలలో తాను కూడా పాలుపంచుకుంటున్నానని దుల్కర్ సల్మాన్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అభిలాష్‌కి ఇదే తొలి సినిమా. 

నిమిష్ రవి సినిమాటోగ్రఫీ
దుల్కర్ సల్మాన్‌తో (Dulquer Salmaan) హీరోగా నటించిన "కురుప్" లాంటి సినిమాకు గతంలో ఛాయాగ్రహణం వహించిన నిమిష్ రవి "కింగ్ ఆఫ్ కోతా" చిత్రానికి కూడా సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. 

షాన్ రెహమాన్ మ్యూజిక్
ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు షాన్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారట. షాన్ గతంలో పలు తెలుగు సినిమాలకు సైతం సంగీత దర్శకత్వం వహించారు. రచయిత, మేడ మీద అబ్బాయి, ప్రేమతో మీ కార్తిక్, సాహెబా సుబ్రహ్మణ్యం లాంటి తెలుగు సినిమాలకు షాన్ మ్యూజిక్ అందించారు. 

ఇవండీ.. దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా "కింగ్ ఆఫ్ కోతా" ముచ్చట్లు

Read More: దుల్కర్‌‌ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటించిన ‘సీతారామం’ (Sitaramam) సినిమా కథ ఎలా పుట్టిందంటే.. ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!