ఆసక్తి రేకెత్తిస్తున్న దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) ‘సీతారామం’ సినిమా మేకింగ్ వీడియో

Updated on Aug 06, 2022 02:16 PM IST
దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న సీతారామం సినిమాలో హీరోయిన్‌గా మృణాళ్‌ ఠాకూర్‌‌ నటించారు.
దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న సీతారామం సినిమాలో హీరోయిన్‌గా మృణాళ్‌ ఠాకూర్‌‌ నటించారు.

దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోగా నటించిన సినిమా ‘సీతారామం’. ‘యుద్దంతో రాసిన ప్రేమ కథ’ అనేది ట్యాగ్ లైన్. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ తెలుగులో నేరుగా నటిస్తున్న సినిమా సీతారామం. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాళ్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్.

ఈ క్రమంలోనే సీతారామం సినిమాపై ఆసక్తిని మరింత పెంచడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అసలు ఆ కథ ఎలా తెరకెక్కిందో తెలియజేసే వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఏ ఏ లొకేషన్లలో ఈ సినిమాను చిత్రీకరించారో, ఎవరెవరు నటించారో మేకింగ్‌లో చూడొచ్చు. కాశ్మీర్‌ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఈ సినిమాలో హైలెట్‌గా నిలిచేలా ఉన్నాయి.

దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా నటిస్తున్న సీతారామం సినిమాలో హీరోయిన్‌గా మృణాళ్‌ ఠాకూర్‌‌ నటించారు.

దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా దర్శకుడు హను రాఘవపూడి రూపొందించిన సినిమా ఇది. మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటించారు. సుమంత్‌, రష్మిక, గౌతమ్‌ మీనన్‌, తరుణ్‌ భాస్కర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. స్వప్న సినిమా బ్యానర్‌‌పై నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. సీతారామం సినిమాలో రష్మికా మందాన కీలకపాత్ర పోషించారు

Read More : Sitaramam Trailer: ఒంటరి సైనికుడికి.. ఓ యువతికి మధ్య నడిచే 1965 నాటి ప్రేమ కథ.. 'సీతారామం' ట్రైలర్!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!