డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్‌ మొదలైందా! సోషల్‌ మీడియాలో షూటింగ్‌ ఫోటోలు వైరల్..

Updated on Sep 27, 2022 04:38 PM IST
చాలాకాలంగా డీజే టిల్లు (DJ Tillu) సినిమా సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. డీజేటిల్లు2 షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది
చాలాకాలంగా డీజే టిల్లు (DJ Tillu) సినిమా సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. డీజేటిల్లు2 షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది

డీజే టిల్లు (DJ Tillu).. చిన్న సినిమాగా వచ్చి ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి సందడి చేసింది ఈ సినిమా. కలెక్షన్లతోపాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్‌ అయ్యింది డీజే టిల్లు సినిమా. ఎంతో కాలంగా ఇండస్ట్రీలో ఉంటున్నా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సిద్దు జొన్నలగడ్డకు కూడా మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది డీజే టిల్లు సినిమా.

డీజే టిల్లు సినిమాలోని సిద్దు జొన్నలగడ్డ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి. ఇక, ఈ సినిమాలో హీరోయిన్‌ నేహా శెట్టి అందచందాలు, నటన మరో హైలైట్ అనే చెప్పాలి. ఈ ఏడాది మార్చి 12వ తేదీన విడుదలైన డీజే టిల్లు సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా.. కరోనా తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్దా? థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? లేదా? అనే సందిగ్ధం నుంచి బయటపడేసింది కూడా. డీజే టిల్లు సినిమాలో తెలంగాణ యాసలో సిద్ధు చెప్పే డైలాగులు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇక, అప్పటి నుంచి డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు సినీ ప్రేమికులు.

డీజే టిల్లు సినిమాకు వచ్చిన క్రేజ్, కలెక్షన్లతో ఆ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే చాలాకాలం ఆ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కలేదు. కొద్దిరోజుల క్రితం సీక్వెల్‌ను కన్ఫమ్‌ చేస్తూ ప్రకటన వెలువడింది. అయితే షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, నటీనటులు ఎవరు అనే విషయాలపై క్లారిటీ రాలేదు. డీజే టిల్లు సీక్వెల్‌కు సిద్దు కథ అందిస్తున్నారని స్పష్టమైంది. సీక్వెల్‌లో కూడా హీరోగా సిద్దు నటించనున్నారని కూడా తేలిపోయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా నేహా శెట్టి కాదని మరొకరిని ఎంపిక చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.

చాలాకాలంగా డీజే టిల్లు (DJ Tillu) సినిమా సీక్వెల్‌ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. డీజేటిల్లు2 షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది

ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న దర్శకుడు..

చాలా మంది పేర్లే వినిపించినా పెళ్లిసందD సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీలీల..డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్‌గా నటించనున్నట్టు తెలిపింది చిత్ర యూనిట్. ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్‌ నుంచి శ్రీలీల తప్పుకుంన్నట్టు ఇటీవలే వార్తలు వచ్చాయి. ఇక, డీజే టిల్లు సినిమాకు దర్శకత్వం వహించిన విమల్‌కృష్ణ హీరోతో విభేదాల కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో డీజే టిల్లు సీక్వెల్‌ ఆలస్యమవుతుందని అందరూ అనుకున్నారు. అయితే, తాజాగా సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలు చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

డీజే టిల్లు సీక్వెల్‌ షూటింగ్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. శరవేగంగా షూటింగ్ నిర్వహించి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

పీడీవీ ప్రసాద్ స‌మ‌ర్పణ‌లో సితార ఎంట‌ర్ట్‌టైన‌మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. అద్భుతం సినిమాకు దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్‌ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మల్లిక్ రామ్‌ ట్విట్టర్‌‌లో ‘The madness begins! #djtillu2’ అని పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read More : డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్‌ నుంచి తప్పుకున్న పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల (Sree Leela)?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!