డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్‌లో హీరోయిన్‌గా పెళ్లి సందD హీరోయిన్ శ్రీలీల చాన్స్ కొట్టేసిందా?

Updated on Aug 20, 2022 06:10 PM IST
డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్‌లో పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైందనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తున్నాయి
డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్‌లో పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైందనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తున్నాయి

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్‌ సాధించింది డీజే టిల్లు (DJ Tillu) సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌ తెరకెక్కించనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించారు. సినిమా సక్సెస్‌కు నేహా శెట్టి క్యారెక్టర్‌‌ ఎంతగానో ఉపయోగపడింది.

‘పెళ్ళి సంద‌D’ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల‌. ఈ చిత్రంతో అటు మాస్ ఇటు క్లాస్ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంది. అందం, అభిన‌యంతో చ‌లాకీ అమ్మాయిగా ప్రేక్షకుల‌ను ఫిదా చేసింది శ్రీలీల. యూత్‌లో ఈ అమ్మడికి విప‌రీత‌మైన క్రేజ్ వచ్చింది. శ్రీలీల చేతిలో ప్రస్తుతం అర‌డ‌జ‌నుకు పైనే సినిమాలున్నాయి. తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ నుండి మ‌రో క్రేజీ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది బ్లాక్ బ‌స్టర్ హిట్‌ సాధించిన సినిమాలలో ‘డీజే టిల్లు’ ఒక‌టి. మార్చ్‌12న విడుద‌లైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుపుకుంటున్న డీజే టిల్లు2 సినిమా త్వర‌లోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.

డీజే టిల్లు (DJ Tillu) సీక్వెల్‌లో పెళ్లిసందD హీరోయిన్ శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైందనే వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేస్తున్నాయి

చాలా మంది పేర్లే అనుకున్నా..

కాగా ఈ సీక్వెల్‌లో సిద్దూకు జోడీగా శ్రీలీలను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా ప‌లువురు పేర్లు అనుకున్నా చివ‌రికి శ్రీలీల‌ను ఎంపిక చేశార‌ని టాక్. దీనిపై అధికారికంగా ప్రకట‌న రావాల్సిఉంది. గ‌తంలో మేక‌ర్స్‌ హీరోయిన్‌గా అనుప‌మా పరమేశ్వరన్‌ను సంప్రదించిన‌ట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడేమో శ్రీలీల ఎంపికైందని వార్తలు వ‌స్తున్నాయి. ఇందులో ఏది నిజ‌మో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ప్రస్తుతం శ్రీలీల‌కు టాలీవుడ్‌లో అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. డీజే టిల్లు (DJ Tillu) సినిమాతోపాటు ర‌వితేజ‌తో శ్రీలీల క‌లిసి న‌టించిన ‘ధ‌మాకా’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్షన్ ప‌నుల‌లో బిజీగా ఉంది. దీనితో పాటుగా నవీన్ పోలిశెట్టితో ‘అన‌గ‌న‌గా ఒక రాజు’ సినిమాలో న‌టిస్తోంది శ్రీలీల. ఇక వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమాలో కూడా హీరోయిన్‌గా శ్రీలీల‌ ఎంపికైంది.

Read More : Neha Shetty: స్కిన్ షో తో అందాల విందు పంచుతున్న 'డీజే టిల్లు' (DJ Tillu) బ్యూటీ నేహా శెట్టి..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!