‘బెదురులంక‌2012’ (Bedurulanka 2012)లో చిత్ర పాత్రలో 'డీజే టిల్లు' బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty).. ఫస్ట్ లుక్ రిలీజ్!

Updated on Dec 05, 2022 03:58 PM IST
‘బెదురులంక‌2012’ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటిస్తోంది.
‘బెదురులంక‌2012’ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటిస్తోంది.

టాలీవుడ్ లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో కార్తికేయ‌ (Kartikeya). ఆయ‌న న‌టిస్తోన్న తాజా చిత్రాని ‘బెదురులంక‌2012’ (Bedurulanka 2012) అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు మేక‌ర్స్. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. క్లాక్స్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎల్బీ శ్రీరామ్‌, అజయ్‌ ఘోష్‌, సత్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

డ్రామిడీ జానర్ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు టైటిల్ కి తగినట్లే కాస్త వెరైటీగా.. ఇన్నోవేటివ్ గా సినిమాకు సంబంధించి పోస్టులను కూడా ఇటీవల ఆవిష్కరించారు. గమ్మత్తైన కాన్సెప్ట్ తో యుగాంతం నేపథ్యంలో సాగే ఓ టిపికల్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రపంచం ఒక ముగింపుకి వచ్చేసిందని నమ్మే ఒక ఊరి చుట్టూ తిరిగే కథ ఇది.. 2012లో డిసెంబర్ 21న ఇలాగే ప్రపంచం అంతమవుతుందని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దాని చుట్టూ సరదాగా సాగే కథే ఇది.

‘బెదురులంక‌2012’ (Bedurulanka 2012) మూవీ ఫస్ట్ లుక్ ను మొదట్లో ఒక వీడియోతో లాంచ్ చేశారు. ఈ వీడియోలో వెనకాల ఒక గడియారం తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత రెండు గోల్డ్ రింగ్స్ ను గాల్లోకి ఎగరేస్తూ హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇందులో హీరో కార్తికేయ క్యాజువల్ బ్లాక్ డ్రెస్ లో కనిపించాడు. ఫస్ట్ లుక్ అంటే రెండు రోజుల ముందు కార్తికేయ ప్రీ లుక్ ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో కేవలం హీరో చేయి మాత్రమే కనిపిస్తోంది. ఆ చేతిపై రివైండ్, ఫార్వర్డ్, ప్లే, పాజ్ బటన్లు పచ్చబొట్టు పొడిపించుకొన్నట్లు హీరో కనిపిస్తాడు.

ఇదిలా ఉంటే.. ‘బెదురులంక‌2012’ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఈ బ్యూటీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఇందులో తడి జుట్టుతో, చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది నేహా. డీజే టిల్లులో (DJ Tillu) మోడ్రన్ గా కనిపించిన నేహా.. ఈ సినిమాలో అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించనున్నట్లు తెలుస్తోంది. చీరకట్టులో నేహా కేక పుట్టిస్తోంది.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ..“కామెడీ డ్రామాగా.. గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మణిశర్మ ఐదు అద్భుతమైన పాటలిచ్చారు. ఇందులో ఓ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యమందించారని దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ రాధిక మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

Read More: హీరో కార్తికేయ (Kartikeya) తాజా చిత్రం ‘బెదురులంక 2012’ (Bedurulanka 2012).. ఇంటెన్సివ్ గా ప్రీ లుక్ పోస్టర్!

Advertisement
Credits: Instagram, Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!