ఎన్టీఆర్‌ (Junior NTR)‌ సినిమా సెప్టెంబర్ నుంచైనా సెట్స్‌పైకి వెళ్లేనా? కొరటాల సినిమా షూటింగ్‌ స్టార్ట్ కాలే

Updated on Aug 14, 2022 10:32 PM IST
జనతాగ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ (Junior NTR) – కొరటాల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోంది.
జనతాగ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ (Junior NTR) – కొరటాల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోంది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రాంచరణ్ 'ఆచార్య' సినిమాతో సందడి చేశారు. ఆ తర్వాత శంకర్ సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయారు. కానీ, ఎన్టీఆర్ (Junior NTR) మాత్రం 'ఆర్ఆర్ఆర్' తర్వాత మరో సినిమాను ఇప్పటివరకు సెట్స్‌పైకి తీసుకెళ్లలేదు. డైరెక్టర్ కొరటాల శివతో సినిమా చేయడానికి కమిట్ అయ్యారు ఎన్టీఆర్. దానికి అన్నీ రెడీగా ఉన్నాయి కూడా. అయితే ఆ సినిమా ఇప్పటివరకు సెట్స్‌పైకి వెళ్లలేదు.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌‌స్టార్ రాంచరణ్‌ హీరోలుగా తెరకెక్కిన ఆచార్య సినిమా విజయం సాధించలేదు. ఆచార్య సినిమా విజయం సాధించకపోవడంతో ఎన్టీఆర్‌‌ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భావించారు కొరటాల శివ. దీంతో ఎన్టీఆర్‌‌తో తెరకెక్కించబోయే సినిమా కథలో మార్పులు, చేర్పులు చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. దాని కోసమే కొన్ని రోజులు సమయం కూడా తీసుకున్నారు కొరటాల.  

జనతాగ్యారేజ్ సినిమా తర్వాత ఎన్టీఆర్ (Junior NTR) – కొరటాల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోంది.

సెట్స్‌పైకి ఎప్పటికి వెళ్లేనో..

ఇప్పటికే చాలా రోజులుగా ఎన్టీఆర్‌‌ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. జూన్‌, జూలైలలో స్టార్ట్ అవుతుందనుకున్న షూటింగ్ ఆగస్టుకు, అక్కడి నుంచి సెప్టెంబర్‌‌ నెలకు పోస్ట్‌పోన్ అయ్యింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెలలో అయినా సినిమా సెట్స్‌పైకి వెళుతుందా లేదా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

కాగా, ఎన్టీఆర్‌‌ – కొరటాల కాంబినేషన్‌లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఆ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విపరీతమైన క్రేజ్ వచ్చింది. దాంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎన్టీఆర్ (Junior NTR) అభిమానులతోపాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More : 'బింబిసార' (Bimbisara) సినిమాతో క‌ల్యాణ్ రామ్ రేంజ్ మ‌రింత పెరుగుతుంది.. ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ (NTR)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!