హిందీ నటులతో పూరి (Puri Jagannath) డ్రీమ్ ప్రాజెక్ట్!.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మారిన ‘జనగణమన’? 

Updated on Oct 27, 2022 04:17 PM IST
 డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ను బాలీవుడ్ నటులతో తెరకెక్కించాలని భావిస్తున్నారట.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ను బాలీవుడ్ నటులతో తెరకెక్కించాలని భావిస్తున్నారట.

‘లైగర్’ (Liger) సినిమా పరాజయం పాలవ్వడం దర్శకుడు పూరి జగన్నాథ్ (Puri Jagannath) కెరీర్ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ‘జనగణమన’ (Jana Gana Mana) మూవీని తీయాలని పూరి భావించారు. అయితే ‘లైగర్’ ఫ్లాప్ కావడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. దీంతో ఎలాగైనా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని పూరి అనుకుంటున్నారట. విజయ్‌తో కుదరకుంటే బాలీవుడ్ హీరోలతో తీద్దామని ఆయన డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇద్దరు హిందీ కథానాయకులను పూరి కలిశారని సమాచారం. 

‘జనగణమన’ తన డ్రీమ్ ప్రాజెక్టు అని పూరి పలుసార్లు చెప్పుకొచ్చారు. ఈ మూవీని 2018లోనే ప్రకటించారు. తొలుత ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్నారంటూ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులు ఈ చిత్రానికి సంబంధించిన వార్తలేవీ బయటకు రాలేదు. అయితే తన కలల ప్రాజెక్టులో విజయ్ దేవరకొండ నటిస్తున్నారని పూరి తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. 

‘లైగర్’ రిజల్ట్‌తో పూరి–విజయ్‌లు ‘జనగణమన’ను పక్కనపెట్టారనే న్యూస్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాను బాలీవుడ్ నటీనటులతో తీయాలని పూరి చర్చలు జరుపుతున్నారట. రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), విక్కీ కౌశల్ (Vicky Kaushal)ను ఆయన సంప్రదించారని సమాచారం. వీరిద్దరిలో ఎవరు ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరి, ‘జనగణమన’ త్వరలో పట్టాలెక్కుతుందేమో చూడాలి. అలాగే ‘లైగర్’ ఫలితంతో డీలా పడ్డ పూరీకి ఈ మూవీ పూర్వ వైభవం తీసుకొస్తుందేమో చూడాలి. 

ఇక, ‘లైగర్’ సినిమాతో నష్టపోయిన బయ్యర్లను ఆదుకుంటానని ఇచ్చిన హామీని పూరి జగన్నాథ్ నిలబెట్టుకునే పనిలో ఉన్నారట. అయితే నైజాంకు చెందిన దాదాపు 83 మంది ఎగ్జిబిటర్స్ అంతా కలసి పూరి ఆఫీసు ముందు ధర్నాకు దిగాలని అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ ఆడియో కాల్ నెట్‌లో చక్కర్లు కొడుతోంది. 

పరువు తీస్తే ఒక్క రూపాయి ఇవ్వను

'ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికీ డబ్బు తిరిగివ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇస్తున్నాను. పాపం వాళ్లు కూడా నష్టపోయారులే అని ఇస్తున్నాను. ఆల్రెడీ బయర్స్‌తో మాట్లాడాను. మన ఒప్పందం ప్రకారం చెప్పిన మొత్తాన్ని ఒక నెలలో ఇస్తాను. అలా చెప్పాక కూడా మళ్లీ ఇలా చేస్తుంటే ఇవ్వాలని అనిపించదు. అయినా మేం ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను’ అని ఆ ఆడియో కాల్‌లో పూరి మాట్లాడటం ఇప్పుడు వైరల్‌గా మారింది. మరి ఇందులో ఎంత నిజముందో పూరికే తెలియాలి. 

Read more: 15 నిమిషాలకే అన్ని కోట్లా?.. ‘ఓరి దేవుడా’ కోసం వెంకీ (Venkatesh Daggubati) అంత రెమ్యూనరేషన్ తీసుకున్నారా? 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!