అట్లీ (Atlee Kumar) దర్శకత్వంలో సల్మాన్ (Salman Khan) సినిమా!.. కోలీవుడ్ దర్శకుడికి పచ్చజెండా ఊపిన కండలవీరుడు?

Updated on Oct 29, 2022 11:39 AM IST
కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ (Atlee Kumar)తో సినిమా చేసేందుకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. 
కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ (Atlee Kumar)తో సినిమా చేసేందుకు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. 

బాలీవుడ్ హీరోలు అందరూ ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమ వైపు చూస్తున్నారు. ఇక్కడ మార్కెట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సౌత్ సినిమాలు ఉత్తరాదిన విజయాలు సాధిస్తుండటంతో అదే ప్లాన్‌ను బాలీవుడ్ స్టార్లు అమలు చేస్తున్నారు. తమ చిత్రాలను దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడి దర్శకులతో పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో తమిళ యంగ్ డైరెక్టర్ అట్లీ కుమార్ (Atlee Kumar)తో ఓ మూవీ చేసేందుకు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.

కెరీర్‌లో పరాజయం అన్నదే లేకుండా దూసుకుపోతున్న యువ కెరటం అట్లీ అందరు స్టార్స్‌ను ఆకర్షిస్తున్నారు. ‘రాజా రాణి’, చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన అట్లీ.. దళపతి విజయ్ హీరోగా ‘తెరి’, ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. అట్లీ గురించి తెలుసుకున్న బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఆయనకు ఓ ఛాన్స్ ఇచ్చారు. షారుక్‌తో ప్రస్తుతం ‘జవాన్’ (Jawan) అనే సినిమాను అట్లీ రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ చెన్నైలో భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. 

అట్లీ ట్రాక్ రికార్డు, షారుక్‌తో తీస్తున్న చిత్రం గురించి విన్న సల్మాన్ ఖాన్.. ఆయనతో ఒక మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. త్వరలో వీరి కలయికలో రానున్న సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని బాలీవుడ్ టాక్. మరోవైపు దళపతి విజయ్ హీరోగా అట్లీ ఓ మూవీని చేయాల్సి ఉంది. తెలుగులోనూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా అట్లీ ఓ చిత్రానికి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆమధ్య వార్తలు వచ్చాయి. మరి, వీటిల్లో ఏ ప్రాజెక్టు ముందు పట్టాలెక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి భాషలతో సంబంధం లేకుండా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అందరి అటెన్షన్‌ను అట్లీ తన వైపునకు తిప్పుకుంటున్నారు. ఈ చిత్రాలన్నీ విజయాలు సాధిస్తే ఆయన పేరు మారుమోగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Read more: తలైవా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకేరోజు రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీకాంత్ (Rajinikanth)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!