మ‌హేష్‌(Mahesh Babu)తో జ‌రిగిన వార్‌పై క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్

Updated on May 05, 2022 01:05 PM IST
మ‌హేష్ బాబు(Mahesh Babu) స‌ర్కారు వారి పాట సినిమా  కొద్ది రోజుల్లో విడుద‌ల కానుంది. మ‌హేష్ బాబుకు ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌కు గొడ‌వ‌లంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి
మ‌హేష్ బాబు(Mahesh Babu) స‌ర్కారు వారి పాట సినిమా కొద్ది రోజుల్లో విడుద‌ల కానుంది. మ‌హేష్ బాబుకు ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌కు గొడ‌వ‌లంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి

మ‌హేష్ బాబు(Mahesh Babu) స‌ర్కారు వారి పాట సినిమా  కొద్ది రోజుల్లో విడుద‌ల కానుంది. మ‌హేష్ బాబుకు ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌కు గొడ‌వ‌లంటూ అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ గొడ‌వ‌ల‌పై డైరెక్ట‌ర్ ప‌రుశురామ్ క్లారిటీ ఇచ్చారు. అస‌లు మ‌హేష్ బాబుకు ఎందుకు కోపం వ‌చ్చిందో కూడా చెప్పారు. 

స‌ర్కారు వారి పాట సినిమా  ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్‌కు మ‌హేష్ బాబుకు మ‌ధ్య గొడ‌వ‌లంటూ ఆ మ‌ధ్య  పెద్ద దుమార‌మే చెల‌రేగింది. అస‌లు ఆ గొడ‌వ‌లేంటి అనేది ప‌రుశురామ్ చెప్పారు.  స‌ర్కారు వారి పాట సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా జ‌రిగిన  ఓ ఇంట‌ర్వ్యూలో ప‌రుశురామ్ గొడ‌వ‌పై క్లారిటీ ఇచ్చారు. 

త‌న‌కు మ‌హేష్ (Mahesh Babu)కు మ‌ధ్య అవలు అస‌లేం జ‌ర‌గ‌లేద‌ని నేను చెప్ప‌ను.. కానీ  అంద‌రూ అనేకునేందు పెద్ద గొడ‌వలేం కాద‌ని పరుశురామ్ చెప్పారు.  స‌ర్కారు వారి పాట సినిమా ఏడాదిలో  పూర్తి అవుతుంద‌నుకున్నాం. కానీ క‌రోన వ‌ల్ల మూడేళ్లు ప‌ట్టింది. ఓ సినిమా ఇంత టైం తీసుకున్నందుకు మ‌హేష్ కొంచెం ప్రెజ‌ర్ ఫీల్ అయ్యారు. త‌న‌పై  చిరు కోపం తెచ్చుకున్నారని.. అంత‌కు మించిన గొడ‌వ‌లు లేవ‌ని క్లారిటీ ఇచ్చారు ప‌రుశురామ్.

స‌ర్కారు వారి పాట  మే 12న రిలీజ్

మ‌హేష్  కేర్ గురించి  చెప్పిన డైరెక్ట‌ర్
మ‌హేష్ బాబు(Mahesh Babu) త‌న‌పై ఎంతో కేర్ చూపించార‌ని  ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ చెప్పారు.  త‌న నాన్న‌కు క‌రోనా వ‌స్తే ప‌ది సార్లు ఫోన్ చేసి ఎలా ఉంద‌ని అడిగార‌ని ప‌రుశురామ్ అన్నారు.  త‌న భార్య‌కు ఓ సారి హెల్త్ ప్రాబ‌మ్స్ వ‌స్తే డాక్ట‌ర్‌కు ఫోన్ చేసి చికిత్స చేయించార‌న్నారు. మ‌హేష్ బాబుకు త‌న‌కు ఎంతో మంచి బాండింగ్ ఉంద‌ని ప‌రుశురామ్ చెప్పుకొచ్చారు.

మ‌హేశ్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మే 12న రిలీజ్ కానుంది. స‌ర్కారు వారి పాట చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల జోరు పెంచింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!