మహేష్ (Mahesh Babu) మూవీలో విలన్‌గా బాలీవుడ్ హీరోయిన్!.. నోరా ఫతేహీ (Nora Fatehi)ని త్రివిక్రమ్ ఫైనల్ చేశారా?

Updated on Nov 14, 2022 11:12 AM IST
మహేష్ (Mahesh Babu)–త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబోలో పదకొండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి
మహేష్ (Mahesh Babu)–త్రివిక్రమ్ (Trivikram Srinivas) కాంబోలో పదకొండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రేక్షకులు కూడా మహేష్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటారు. ఆయన చిత్రాలకు ఉండే క్రేజ్ అలాంటిది. ఈ టాలీవుడ్ ప్రిన్స్ సినిమాలకు సంబంధించిన ఏ అప్‌డేట్ వచ్చినా వెంటనే వైరల్ అయిపోతుంది. మహేష్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఇప్పుడు అలాంటి ఓ వార్త నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. 

క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్  (Trivikram Srinivas) దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా (SSMB 28)లో మహేష్ నటిస్తున్నారు. సూపర్‌స్టార్‌కు ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ నోరా ఫతేహీ (Nora Fatehi)ని ఈ సినిమాలో కీలక పాత్రలో తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఉత్తరాదిన మంచి పాపులారిటీ సంపాదించిన నోరా ఫతేహీని ఏకంగా విలన్ రోల్‌లో తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ నోరా ఫతేహీ (Nora Fatehi)ని ఈ సినిమాలో కీలక పాత్రలో తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట

త్రివిక్రమ్–మహేష్​ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకుముందు వీరి కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. పదకొండేళ్ల గ్యాప్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రం కోసం యాక్టర్స్‌ను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. హారికా హాసిని క్రియేషన్స్ పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాను.. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారని సమాచారం. మరి, ఈ మూవీతో త్రివిక్రమ్, మహేష్ మరోమారు తమ మ్యాజిక్‌ను వెండితెరపై రిపీట్ చేస్తారేమో చూడాలి. 

Read more: టాలీవుడ్‌ (Tollywood)లో శాండల్‌వుడ్‌ హీరోయిన్ల హవా.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న కన్నడ భామలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!