విదేశాల నుంచి హైదరాబాద్ చేరుకున్న మహేష్ బాబు (Mahesh babu).. త్వరలో ‘SSMB28’ షూటింగ్ ప్రారంభం!

Published on Nov 01, 2022 02:52 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) ఇటీవల ఫ్యామిలీతో కలిసి చిన్న వెకేషన్ కోసం లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు గౌతమ్ అక్కడ చదువుతున్న క్రమంలో భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితారలతో కలిసి అక్కడికి వెళ్లారు. కొన్ని రోజులు అక్కడే గడిపిన మహేష్ ఫ్యామిలీ తాజాగా లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

త్వరలో ‘ఎస్ఎస్ఎంబీ28’ (SSMB28) సినిమా షూటింగ్‌లో మహేష్‌ పాల్గొననున్నట్లు సమాచారం. నవంబర్ నుంచి రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దర్శకుడు త్రివిక్రమ్ (Director Trivikram) ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.

ఎస్ఎస్ఎంబీ28’ (SSMB28) సినిమా తొలి షెడ్యూల్ ఆ మధ్య హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అక్కడే ఓ వారం రోజులు పాటు షూట్ చేశారు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో కొన్ని హై ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. ఇక రెండో షెడ్యూల్ త్వరలో మొదలుకానుందని తెలిపారు చిత్ర నిర్మాత నాగవంశీ.

Read More: మహేష్ బాబు (Mahesh Babu) త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘SSMB28’ సినిమాపై పుకార్లకు చెక్ పెట్టిన నిర్మాత!