పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ సినిమాలో జాక్వెలిన్‌ స్థానంలో నోరా ఫతేహి?

Updated on May 05, 2022 04:36 PM IST
నోరా ఫతేహి, పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan)
నోరా ఫతేహి, పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan)

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’ . 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే చారిత్రక కథ ఆధారంగా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఇస్మార్ట్‌ శంకర్‌‌ భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలోని మరో కీలకపాత్రలో నర్గిస్‌ ఫక్రి నటిస్తోంది. అయితే, మరో కీలకపాత్రలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ నటించబోతోందని వార్తలు ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేశాయి. ఇప్పుడు జాక్వెలిన్ పాత్రలో వేరే వాళ్లను తీసుకున్నారని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్థానంలో కెనడా భామ నోరా ఫతేహి యాక్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ శరవేగంగా సాగుతున్న హరిహర వీరమల్లు సెట్స్‌లో నోరా ఫతేహి జాయిన్‌ కానుందని తెలుస్తోంది. ఇక, ఇప్పటికే పలు స్పెషల్ సాంగ్స్‌లో ఆడిపాడిన నోరా ఫతేహి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. టెంపర్‌‌లో ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ సందడి చేసింది. బాహుబలిలో మనోహరి పాటలో ఆడిపాడింది. ఊపిరి సినిమాలో డోరు నంబరు అంటూ మాస్ డ్యాన్స్‌ చేసింది నోరా ఫతేహి.

హరిహర వీరమల్లు సినిమా గురించి మరో అప్‌డేట్‌ బయటికి వచ్చింది. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఈ దసరాకు విడుదల కావడం లేదని తెలుస్తోంది. ఏప్రిల్‌ నెల నుంచి రెగ్యులర్‌‌ షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌ వాయిదా పడిందనే వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

సినిమా షూటింగ్‌తోపాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తొందరగా విడుదల చేయాలని అనుకున్న చిత్ర యూనిట్‌ ప్లాన్‌ మార్చుకుందని సమాచారం. అనుకున్న సమయానికి షెడ్యూల్ ప్రకారం షూటింగ్‌ పూర్తియినప్పటికీ.. వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తికాకపోవచ్చుననే అనుమానంతో రిలీజ్‌ డేట్స్‌ మార్చినట్టు ఇండస్ట్రీలో టాక్. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏ ఎం రత్నం భారీ బడ్జెట్​తో సినిమాను నిర్మిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) కెరీర్‌‌లో మొదటి పాన్‌ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. హరిహర వీరమల్లు సినిమాలో పవన్‌ కల్యాణ్‌ లుక్‌ చూసిన ఫ్యాన్స్‌ సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్‌ సాధిస్తుందని ఫిక్స్ అయిపోయారు,

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!