ఫ్యాన్స్ కోసం ‘ఆదిపురుష్’ (Adipurush) టీజర్ స్పెషల్ స్క్రీనింగ్స్.. అభిమానులను రివ్యూ కోరిన ప్రభాస్ (Prabhas)

Updated on Oct 07, 2022 10:35 AM IST
ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’  (Adipurush) త్రీడీ టీజర్‌ను ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా 60 థియేటర్లలో ప్రదర్శించనున్నారు 
ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) త్రీడీ టీజర్‌ను ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా 60 థియేటర్లలో ప్రదర్శించనున్నారు 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన ‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రం టీజర్ ఇటీవలే రిలీజై యూట్యూబ్‌లో నంబర్ వన్‌గా ట్రెండ్ అవుతోంది. ఈ టీజర్‌పై మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ వ్యూస్, లైకుల పరంగా మాత్రం దూసుకెళ్తోంది. ఈ టీజర్‌‌ విడుదలైన 24 గంటల్లోనే 101 మిలియన్ వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది. తద్వారా ఇండియాలోనే నంబర్‌‌ 1 టీజర్‌‌గా నిలిచింది.

రికార్డులు ఎలా ఉన్నప్పటికీ.. ఆదిపురుష్ టీజర్‌పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. టీజర్ కార్టూన్ వీడియోలా ఉందని.. తమిళ సూపర్ స్టార్ గతంలో నటించిన ‘కొచ్చాడియాన్’ను ఇది గుర్తు చేస్తోందని నెట్టింట్లో కామెంట్లు వస్తున్నాయి. అదే సమయంలో హిందూ వర్గాలు కూడా టీజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్ని వైపుల నుంచి నెగటివిటీ వస్తుండటంతో ‘ఆదిపురుష్’ టీమ్ అలర్ట్ అయ్యింది. 

ఎలాగైనా సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలని ‘ఆదిపురుష్’ మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా టీవీలు, మొబైల్స్‌లో ఆదిపురుష్ టీజర్ చూసి ఓ అభిప్రాయానికి రావొద్దని చిత్ర దర్శకుడు ఓం రౌత్ (Om Raut) కోరుతున్నారు. ఇది త్రీడి మోషన్ కాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కించిన సినిమా అని ఆయన స్పష్టం చేస్తున్నారు. బిగ్ స్క్రీన్స్‌లో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచడానికి రూపొందించిన చిత్రమని వివరిస్తున్నారు. 

ఈ క్రమంలో బిగ్ స్క్రీన్స్‌లో టీజర్ ఎలా ఉంటుందో చూడాలంటూ ‘ఆదిపురుష్’ మేకర్స్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. గురువారం హైదరాబాద్‌లో చిత్ర ప్రముఖులతోపాటు విలేకరులకు త్రీడీ కళ్లజోళ్లు ఇచ్చి టీజర్‌ను ప్రదర్శించారు. కార్యక్రమంలో ‘ఆదిపురుష్’ నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడారు. చివర్లో హీరో ప్రభాస్ కూడా మాట్లాడారు. అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా వచ్చినందుకు ప్రభాస్ క్షమాపణలు చెప్పారు.

థియేటర్‌లో చూసి థ్రిల్ ఫీలయ్యాను

విజువల్స్, యానిమల్స్ ముఖంపై ఆడటం తెలియని అనుభూతిని పంచిందని ప్రభాస్ అన్నారు. త్రీడీ ఫార్మాట్‌లో టీజర్ చూసి థ్రిల్ ఫీలయ్యానని చెప్పారు. ఫ్యాన్స్ కోసం శుక్రవారం 60 త్రీడీ థియేటర్స్‌లో టీజర్‌ను ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు. ‘ఫ్యాన్స్ ఈ త్రీడీ టీజర్ చూసి మాకు రివ్యూ చెప్పాలి. మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మీ కోసం తీసిన సినిమా. థియేటర్స్‌లో టీజర్ చూడండి. మీ అభిప్రాయం చెప్పండి. మీకు నచ్చుతుందని భావిస్తున్నాను‘ అని ప్రభాస్ అన్నారు. . 

అలాగే మరికొన్ని వారాల్లో అదిరిపోయే కంటెంట్‌తో కొత్త ప్రోమోను విడుదల చేస్తామని ప్రభాస్ చెప్పారు. ఇకపోతే, ‘ఆదిపురుష్’లో ప్రభాస్ సరసన కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఇందులో రావణుడి క్యారెక్టర్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం 2023, జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

Read more: Boy cott Adipurush : 'బాయ్ కాట్ ఆదిపురుష్' ట్రెండింగ్ వెనుక ఉన్న‌ అస‌లు కార‌ణాలు ఏంటి?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!