‘జైలర్‌‌’గా రాబోతున్న సూపర్‌‌స్టార్‌‌ రజినీకాంత్‌ (Rajinikanth).. టైటిల్‌ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

Updated on Jun 17, 2022 02:33 PM IST
రజినీకాంత్‌ (Rajinikanth) కొత్త సినిమా జైలర్‌‌ పోస్టర్
రజినీకాంత్‌ (Rajinikanth) కొత్త సినిమా జైలర్‌‌ పోస్టర్

సూపర్‌‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు పవర్‌‌ ఫుల్ టైటిల్‌ను సెలెక్ట్ చేసింది చిత్ర బృందం. టాలెంటెడ్ డైరెక్టర్‌‌ నెల్సన్ దిలీప్ కుమార్‌‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు ప్రకటించింది చిత్ర యూనిట్.

తలైవా 169 అనే వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టుకు ‘జైలర్‌‌’ టైటిల్‌ను కన్ఫమ్ చేస్తూ.. టైటిల్‌ పోస్టర్‌‌ను విడుదల చేశారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

పవర్‌‌ఫుల్‌ టైటిల్‌కు తగినట్టుగానే పోస్టర్‌‌ను కూడా అంతే పవర్‌‌ఫుల్‌గా డిజైన్ చేశారు. రక్తంతో తడిసిన పెద్ద కత్తి వేలాడుతున్నట్టుగా పోస్టర్‌‌లో కనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రజినీకాంత్‌ రేంజ్‌కు సరిపడా హిట్‌ లేకపోవడంతో అభిమానులు కొంత నిరాశగా ఉన్నారు.

రజినీకాంత్‌ (Rajinikanth) కొత్త సినిమా జైలర్‌‌ పోస్టర్

మరోసారి ఐశ్వర్యారాయ్ జంటగా..

ఈ సినిమా టైటిల్, పోస్టర్ చూస్తుంటే సూపర్‌‌స్టార్ రజినీకాంత్ అభిమానులకు ఈ సినిమా మంచి ఫీస్ట్‌ అనేలా ఉంది. టైటిల్‌ ప్రకారం చూస్తుంటే రజినీకాంత్ ఈ సినిమాలో జైలర్‌‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. జైలులోని ఖైదీల మధ్య జరిగే కథ అనే టాక్‌ వినిపిస్తోంది. జైలర్‌‌ సినిమాలో భారీ స్థాయిలో యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని సమాచారం.

జైలర్‌‌ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, రజినీకాంత్‌ పక్కన ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. రజినీ, ఐశ్వర్యారాయ్‌ జంటగా రోబో సినిమాలో నటించారు.

అయితే జైలర్‌‌ సినిమాలో ఐశ్వర్యారాయ్‌ హీరోయిన్‌గా నటిస్తుందా లేదా అనేదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కబాలి నుంచి పెద్దన్న సినిమా వరకు సూపర్‌‌స్టార్ రజినీకాంత్‌ నటించిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న స్థాయిలో సందడి చేయలేదు. మరి ఈ సినిమాతో అయినా రజినీకాంత్ (Rajinikanth) తన రేంజ్ హిట్ అందుకుంటారేమో చూడాలి.

Read More : రజినీకాంత్ (Rajinikanth) చంద్రముఖి సినిమా సీక్వెల్ ప్రకటించనున్న లైకా ప్రొడక్షన్స్?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!