The Warrior: 20 మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించిన.. రామ్ పోతినేని సినిమా 'ది వారియర్' టీజర్ !

Updated on Jun 12, 2022 07:51 PM IST
ది వారియర్ మూవీ పోస్టర్ (The Warrior Movie Poster)
ది వారియర్ మూవీ పోస్టర్ (The Warrior Movie Poster)

The Warrior: టాలీవుడ్ ఎనర్జిటిక్‌ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం 'ది వారియర్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. తెలుగు.. తమిళ భాషల్లో నిర్మితమైన ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి (Krithi Shetty) అలరించనుంది. తన కెరీర్‌లోనే తొలిసారిగా రామ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.

ఈ మూవీలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ మధ్యకాలంలో రామ్ పోతినేని ఒక వైపు లవర్ బాయ్ సినిమాలు చేస్తూనే, మరో వైపు పవర్ఫుల్ మాస్ మూవీలు చేస్తూ ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.  

ది వారియర్ పై భారీ అంచనాలు

ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ (Devisri Prasad) ఈ సినిమాకు అందించిన పాటల నుండి చిత్ర బృందం రెండు పాటలను విడుదల చేయగా, వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.  కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ టీజర్‌లో రామ్ పోతినేని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనపించగా, ఆది పినిశెట్టి తన విలనిజంతో ప్రేక్షకులను అలరించాడు. 

హీరో రామ్ కు అద్భుత అవకాశం

ఈ చిత్ర టీజర్‌కు తెలుగు,తమిళ భాషల్లో కలుపుకుని 20 మిలియన్ ప్లస్ వ్యూస్ రావడం విశేషం. హీరో రామ్  (Ram Pothineni) పాత్రను ఎలివేట్‌ చేస్తూ ఈ టీజర్‌ను కట్‌ చేశారు.. రామ్ తనదైన యాక్షన్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా, రౌడీలను కొట్టేసి పెయిన్ కిల్లర్ ఇవ్వడం కొత్తగా అనిపించింది. ఇందులో విలన్‌గా ఆది పినిశెట్టి లుక్‌ను కూడా రివీల్ చేశారు. వీలైతే మారిపోండి .. లేకపోతే  పారిపోండి' .. ' ధైర్యం అంటే వెతుక్కుంటూ వచ్చిన వాళ్లని కొట్టడం కాదు .. వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం' వంటి డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. కాగా, ఈ సినిమాలో నదియా.. అక్షరగౌడ.. భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

Read More: రామ్ పోతినేని (Ram Pothineni): “ది వారియర్” సినిమాలో దుమ్మురేపిన మన ఇస్మార్ట్ శంకర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!