Vijay Devarakonda: డ్యాన్స్ తో ఆక‌ట్టుకుంటున్న‌ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే.. వీడియో వైర‌ల్!

Updated on May 31, 2022 08:34 PM IST
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే (Vijay Devarakonda, Ananya Pandey)
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే (Vijay Devarakonda, Ananya Pandey)

Vijay Devarakonda: టాలీవుడ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటించిన తాజా చిత్రం 'లైగర్‌' (Liger). ఈ చిత్రాన్ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్ల‌పై అపూర్వ మెహ‌తా, క‌ర‌ణ్ జోహార్, ఛార్మీ కౌర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో వ‌స్తున్న ఈ చిత్రంలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ కీ రోల్ పోషిస్తున్నాడు. సీనియ‌ర్ న‌టి ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్రలో న‌టిస్తోంది. 

కాగా, నిర్మాత‌లు ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Pandey) టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది. విజయ్ దేవరకొండ అభిమానులైతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆగ‌స్టు 25న‌ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. 

ముంబ‌యి బ్యాక్ డ్రాప్‌లో బాక్సింగ్ నేపథ్యంలో అత్యంత కేర్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు పూరి. ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా త‌ర్వాత ఆయ‌న డైరెక్ష‌న్‌లో రూపొందుతున్న సినిమా కావ‌డంతో లైగ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. దీనికి తోడు ఇప్పటికే రిలీజ్ చేసిన లైగర్ అప్‌డేట్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని పెంచేశాయి. ఈ నేపథ్యంలో మెల్లగా చిత్ర ప్రమోషన్స్ షురూ చేస్తున్న చిత్ర యూనిట్ ఒక్కో అప్‌డేట్ బయటకు వదులుతూ హైప్ క్రియేట్ చేస్తోంది. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే (Ananya Pandey) ఇద్దరూ కలిసి అదిరిపోయే హుక్ స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లైగర్‌ నిర్మాతలో ఒకరైన కరణ్‌ జోహార్‌ లేటెస్ట్‌ మూవీ జగ్‌ జగ్‌ జియో చిత్రంను విజయ్‌, అనన్యలు ప్రమోషన్‌ చేశారు. దీనిలో భాగంగా ఈ సినిమాలోని పంజాబ్బ‌న్ సాంగ్‌కు వీరిద్దరు కలిసి హుక్‌స్టేప్‌ వేశారు. 

ఈ వీడియోను షేర్‌ చేస్తూ అనన్య.. ‘ఈ పాట జోరుకు హుక్‌స్టేప్‌ వేయకుండ ఉండలేకపోయాం. ఈ సాంగ్‌ బాగా ఆకట్టుకుంటోంది. జగ్‌ జగ్‌ జియో టీం శుభాకాంక్షలు’ అంటూ షేర్‌ చేసింది. ఈ సాంగ్‌కు అనన్య, విజయ్‌లు కలిసి హుక్‌ స్టేప్‌ వేయడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోకు విజయ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

‘వీరిద్దరు కలిసి డాన్స్‌ చేయడం చూస్తుంటే లైగర్‌ (Liger) చిత్రంలో వీరిమధ్య రొమాన్స్‌ ఏరేంజ్‌లో ఉండబోతోందో అర్థమవుతుంది’ అని కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాదు ‘లైగర్‌ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’, ‘మీ జోడి బాగుంది’ అంటూ స్పందిస్తున్నారు. లైగర్ సెట్‌లో విజయ్ చాలా సరదాగా ఉంటారని, అమెరికాలో లైగర్‌ షూటింగ్‌ రోజులను ఎ‍ప్పటికీ మర్చిపోలేనని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అనన్యపాండే. దీంతో వెండితెరపై ఈ జోడీ కెమిస్ట్రీ చూడాలని రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఉన్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!